మూసీ ప్రక్షాళన చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌కు కళ్లు ఎర్రబడుతున్నాయి: మానవతా రాయ్ ఫైర్!

Musi Project Controversey: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

Arun Chilukuri
Published on: 29 Jun 2026 10:39 AM IST
మూసీ ప్రక్షాళన చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌కు కళ్లు ఎర్రబడుతున్నాయి: మానవతా రాయ్ ఫైర్!
X

మూసీ ప్రక్షాళన చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌కు కళ్లు ఎర్రబడుతున్నాయి: మానవతా రాయ్ ఫైర్!

Musi Project Controversey: తెలంగాణలో ప్రతిష్టాత్మక 'మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు' రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ యువ నాయకుడు మానవతా రాయ్ తీవ్రస్థాయిలో కొట్టిపారేశారు. hmtv నిర్వహించిన ప్రత్యేక న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.

మూసీ ప్రక్షాళన కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమేనంటూ వస్తున్న ఆరోపణలను మానవతా రాయ్ తిప్పికొట్టారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మూసీ ప్రక్షాళన కోసం అక్రమ కట్టడాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తామని స్వయంగా కేటీఆర్ మాట్లాడిన వీడియోలను ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రదర్శించారని గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story