Jordar News: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సాబ్..

Jordar News: ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్య మురళీ నాయక్. మారుమూల గిరిజన గ్రామానికి రూ. 4 కోట్ల నిధులు మంజూరు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 May 2026 6:58 AM IST
Jordar News
X

Jordar News: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సాబ్..

Jordar News: బండి నడుపుతున్న ఈ సారు గురిచేనుల్లా ముచ్చట. ఇంతకు ఈసారు ఎవ్వలో ఏర్పాటు జేశిర్రా. మైబ్బాద్ ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ సారు. ఇంతకు ముచ్చటేందంటే., గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం ఊరు ఎక్కన్నో కొండలు, గుట్టల్ల ఉంటది. ఇగీ ఊరికి సక్కని సౌలతులు లేక అక్కడి ప్రజలు శానా గోసపడ్తున్నరట. దీంతోని ఎమ్మెల్యేగ గెలుస్తే ఈ ఊరిని అన్ని తీర్ల అభివృద్ది జేస్తనని మాటిచ్చిండట అప్పట్ల. ఇగిప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ పనులన్ని చెయ్యడానికి నాలుగు కోట్ల రూపాల నిధులు మంజూరు చేయించిడట.

ఇగా పనులు శాల్జెయ్యడానికి 20 కిలో మీటర్ల దూరం దట్టమైన అడివిల బండి మీద ప్రయాణం జేశిండు ఎమ్మెల్యే సారు. ఓదిక్కు ఎండ దంచుతున్నా లెక్కజెయ్యకుంట ఇల్లిల్లూ తిరుగుకుంట గిరిజన బిడ్డల గోసలు తీర్శే పని ముంగటేస్కున్నడు. మొత్తానికైతే దొరవారి తిమ్మాపురం ఊరోళ్లందర్ని ఒక్క కాడ కూసుండవెట్టి ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు వరాల జల్లు కురిపిచ్చేటాల్లకు అక్కడి జనాలు గుడ మస్తు ఖుషీ అయ్యిర్రు. మరిగ ఈ ఎమ్మెల్యే లెక్కన్నే కడ్మ ఎమ్మెల్యేలంత గుడ ప్యాదల కోసం మంచిగ పన్జెయ్యాల్నని మన జోర్దార్ తర్పున గుడ కోరుకుంటున్నం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story