Jordar Varthalu: శభాష్ మినిస్టర్ సాబ్

Jordar Varthalu: మే డే సందర్భంగా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు సందడి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 May 2026 8:00 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: శభాష్ మినిస్టర్ సాబ్

Jordar Varthalu: మంత్రి నిమ్మల సారు రిక్షా నడుపుతుంటే., ఒరేయ్ రిక్షా సిన్మాల నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నా రక్తమె నా రిక్షకు పెట్రోలు అని పాడుకుంట రిక్షా తొక్కే ఆర్ నారాయణ మూర్తి సారు యాదికచ్చిండులే. మరిగ రోముకు పోతే రోమన్ లెక్క ఉండాలే అన్నట్టు.. రిక్షా కార్మికుల తానికి పోయిండు గావట్టి., మంత్రి నిమ్మలరామానాయుడు సారు అప్పటి మందం రిక్షా కార్మికుని అవుతారం ఎత్తి కార్మికుల కష్టాలు ఎట్లుంటయో తెల్సుకున్నడన్నట్టు. మేడే యాల్ల పాలకొల్లుల రిక్షా కార్మికులతోని భారీ ర్యాలీ తీశిర్రు. ఇగీ కార్యక్రమానికి హాజరువడ్డ మంత్రి నిమ్మల సారు.. ఏదో రిక్షా తొక్కినమా.. ఓ నాలుగు ఫోట్వలు దిగినమా అన్నట్టు జెయ్యలేదు. ఓదిక్కు ఎర్రటి ఎండ దంచుతున్నా గుడ రిక్షా కార్మికుల కష్టాలు తెల్వాల్నని నాలుగు కిలోమీటర్ల దూరం దాంక రిక్షా తొక్కిండు. స్వయంగ రిక్షా కార్మికులు ఎంత గోసవడ్తరనేది తెల్సుకున్నడు. అటెంక వెట్టిన కార్యక్రమంల కార్మికులను సన్మానించి బట్టలు వంచిండు నిమ్మల సారు.

ఇగాడ మాట్లాడుకుంటా.. కార్మికలోకంతోనే అభివృద్ది జరుగుతది. పొద్దుగాల లేశ్న కాడ్నుంచి రాత్రి పండుకునే దాంక ప్రతీ సౌకర్యం ఎన్కాల కార్మికులు, ఆళ్ల కష్టం ఉన్నదని జెప్పుకచ్చిండు మంత్రి నిమ్మల సారు. మరిగ అసొంటి కార్మికుల కోసం ప్రభుత్వాలు గుడ ఎంత జేశ్నా తక్కోనే అయితది. రాష్ట్రం, దేశం అభివృద్దిల భాగమైతున్న కార్మికుల కోసం సందర్భమచ్చినప్పుడు ఏదో నాలుగు మాటలు జెప్పుడు వాళ్లను సల్లవడగొట్టుడు కాకుంట వాళ్ల పాయిదా అయ్యే పథకాలు తీస్కచ్చి కార్మికులు బాగువడేతట్టు జెయ్యాల్నని మన జోర్దార్ తర్పున గుడ అన్ని ప్రభుత్వాలను కోరుతున్నం.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story