Jordar News: ప్రశ్నించినందుకు కరెంట్ కట్..

Jordar News: మెయింటెనెన్స్ ఛార్జీల పెంపును ప్రశ్నించినందుకు నాగోల్ రాజీవ్ స్వగృహలో ఓ ఫ్లాట్ యజమానికి కరెంట్ కట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 May 2026 6:50 AM IST
Jordar News
X

Jordar News: ప్రశ్నించినందుకు కరెంట్ కట్..

Jordar News: ఇగో ఈడున్నోళ్లంత వారం రోజుల సంది చీకట్లనే మగ్గుతున్నరుల్లా. నాగోల్ రాజీవ్ స్వగృహల ముచ్చటిది. ప్లాట్ ఓనర్ల తీర్మానం లేకుంటనే మెయింటనెన్స్ ఎందుకు పెంచుతున్నరని ప్రశ్నించినందుకు ఈ ఫ్లాట్‌కు వారం రోజుల సంది కరెంట్ కట్ చేసిర్రట. నాగోల్‌ లున్న రాజీవ్ స్వగృహ సహాభావన టౌన్‌షిప్ల ఉండే కమిటీ సభ్యులు ఇంతటి ఘనకార్యాన్ని ఎలగవెట్టిర్రట. ఎండాకాలంల ఒక్క గంట కరెంటు లేకుంటెనే పాణమంత గాయిగాయి అయితది. అసొంటిది వారం రోజుల సంది కరెంటు లేకపొయ్యేటాళ్లకు పొద్దందాంక ఉడ్కపోతకు.., రాత్రైతె చీకటికి మస్తు అవస్థవడ్తున్నరట. మరిగ ఆళ్ల గోసేందో ఆ అన్ననే జెప్తున్నడు ఇనుండ్రి.

చక్రపాణి అనే ఈ అన్న ప్లాట్ల ఓనర్ల తీర్మానం లేకుంటనే కమిటీ సభ్యులు మెయింటనెన్స్ ఎట్ల పెంచిర్రు, గతంల వసూలు చేశ్న పైసలు ఏం ఖర్చు జేశిర్రని ప్రశ్నించినందుకు నా మీద కక్ష కట్టి కరెంట్ కట్ చేశిర్రని బాధపడ్తున్నడు.

ఎండాకాలం అయ్యేటాళ్లకు చిన్న పిల్లలు ఉడ్కపోతకు మస్తు ఇబ్బందులు పడుతున్నరు. అయినా గుడ కనీసం మానవత్వం అనేదే లేకుంట కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నరని బాధపడవట్టిండు. ఇగీ ముచ్చట గురించి ఫిర్యాదు జేద్దామని నాగోల్ పోలీస్ స్టేషన్కు పోతే., పోలీసులు ఫిర్యాదు తీసుకోకుంట ఎన్కకు పంపిర్రట. దీంతోని ఎస్సీ కమీషన్‌ ను కల్శిండట. మరీ అన్నకు ఎట్ల న్యాయం జేస్తరో సూడాలెగనీ., ప్రశ్నించుడే పాపమన్నట్టు జేస్తున్నరుల్లా ఈనడ్మ కొంత మంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story