Jordar News: అవును నిజమే.. బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి
Jordar News: తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వాస్తవమేనని అంగీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Jordar News: అవును నిజమే.. బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి
Jordar News: మొన్నట్ల ముఖ్యమంత్రి రేవండ్ రెడ్డి సారేమో ఇంకో 20 శాతం ధాన్యం కొంటె అయిపోతదని జెప్పిండు. కనీ., రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం బరాబార్ ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నడు. కల్లాలల్ల ధాన్యం పోశి రైతులు అవస్థవడ్తున్న మాట నిజమే. కాకుంటే., పంట బగ్గ పండేటాళ్లకు ఆల్శమైతున్నది. కావట్టి ప్రభుత్వం తర్పున క్షమాపణలు జేప్తున్న. రైతులు అర్థం జేస్కోని సహకరించాల్నని కోరిండు. అట్లనే గీ మాట సుతం మాట్లాడిండు.
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలున్న ప్రైవేటు గోదామును పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇట్ల మాట్లాడుకచ్చిండు. రైతుల కాడ్నుంచి తీస్కున్న ధాన్యాన్ని నిల్వ జెయ్యడానికి ఈ గోదామును వాడుతరట. ప్రతిపక్షాలు గుడ రైతులకు మంచి జరుగాల్ననే పోరాటం జేశ్నయిగావట్టి., దాన్నేం రాజకీయ కోణంల సూస్తలేమని జెప్పుకచ్చిన కోమటిరెడ్డి సారూ.. బరాబర్ పదిరోజుల లోపట దాన్యం మొత్తం కొంటమని మాటిచ్చిండు. ఇప్పట్కే ఆడాడ వర్షాలు వడి శేతికచ్చిన పంట ఆగమైతున్నది. ఇంకొన్ని రోజులు ఇట్లనే పెండింగులుంటె మాత్రం వర్షాలు దండిగవడి రైతులు శానా నష్టపోతరు. కావట్టి., జల్దిన్నే ప్రతీ గింజ కాడ్నుంచి కొంటె ప్యాద రైతులకు పాయిదా అయితదని అంటున్నరు అన్నదాతలు. సూడాలె మరి దాన్యం కొనుగోలు ఎప్పటి వరకు పూర్తి జేస్తరనేది.




