Jordar Varthalu: పాత వీడియోలతో కవితక్కకు తిప్పలే.. కౌంటర్లేస్తున్న కారు పార్టీ కార్యకర్తలు

Jordar Varthalu: కెసిఆర్‌పై కవిత విమర్శల పర్వం! గతంలో కెసిఆర్‌ను పొగిడిన కవిత వీడియోలను వైరల్ చేస్తూ కౌంటర్ ఇస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 7:40 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: పాత వీడియోలతో కవితక్కకు తిప్పలే.. కౌంటర్లేస్తున్న కారు పార్టీ కార్యకర్తలు

Jordar Varthalu: బరాబర్ యాడది కింద కారు పార్టీ రజతోత్సవ సభకు ముందు మా ప్రభుత్వం జేశ్న కార్యక్రమాలు జాతీయ స్థాయిల అమలు జేశే పరిస్థితి అచ్చింది. అందుకే జాతీయ స్థాయిల గుడ పన్జెయ్యాల్ననే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగ మారిందని కుద్దు కవితమ్మనే ఎన్నో మాట్ల జెప్పింది. అసొంటిది ఇప్పుడు ఏం పీకి కట్టలు కట్టినమని ఎట్ల మాట్లాడుతదని కేసీఆర్ అభిమానులు కుతకుత ఉడుకుతున్నరు. అప్పడు గొప్పగ పన్జేశ్నమన్న నోటితోనే ఇప్పుడు ఏం పన్జెయ్యలేదని పార్టీ ప్రకటించినప్పుడు ఎట్ల మాట్లడుతదని కోపానికస్తున్నరు.

మాజీ సీఎం కేసీఆర్కు నోటిసులు ఇచ్చినందుకు కేసీఆర్ ఏం తప్పు జేశిండని నోటీసులు ఇచ్చిర్రు. కేసీఆర్ కు నోటీసులిస్తే యావత్తు తెలంగాణకే నోటీసులిచ్చినట్టు అని శేతిపార్టీ సర్కార్ మీద బగ్గనే గరానికచ్చిన కవితక్క.. యాడాది గుడ తిర్గక ముందే అదే కేసీఆర్ను వట్టుకోని మరమనిషి అని ఎట్ల మాట్లాడుతదని ఫైర్ అయితున్నరు.

కవితమ్మ గిట్ల మాట్లాడేటాళ్లకు కేసీఆర్ సారు అభిమానులు బగ్గనే కోపానికస్తున్నరు. నువ్వు లిక్కర్ కేసుల ఇరుక్కోని నెలల తరబడి తీహార్ జైల్ల ఉంటె కోట్లు ఖర్సువెట్టి బైటికి తీస్కచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అయ్యిండా అని కవితమ్మకు కౌంటర్లేస్తున్నరు.

ఆ యాల్ల ఇంటింటికి నీళ్లిచ్చిండు కేసీఆరు. 60 ఏండ్ల గోస తీర్శిండు కేసీఆర్ అని గొప్పగ జెప్పి ఇప్పుడు గిట్ల మాట్లాడేతందుకు నీకు నోరెట్లచ్చింది కవితమ్మ అని ప్రశ్నిస్తున్నరు.

పార్టీ పెడ్తె పెట్టుకున్నది. దాన్ని ఎవ్వలు కాదంటలేరు. ఆమె కొట్లాడాలంటె రాష్ట్రంల అధికారంలున్న శేతిపార్టీ సర్కారు మీద కొట్లాడాలే. లేకుంటె కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినయి అత్తలెవ్వని కేంద్రం మీద బీజేపీ మీద కొట్లాడాలెగనీ., రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ను వట్టుకోని ఎటువడ్తె అటు ఎట్ల మాట్లాడుతదని కారు పార్టీ లీడర్లు కారాలు మీరాలు నూరుతున్నరట. మరిగ ఇది ఇంతటితోనే అయిపోతదో.. లేకుంటె రేపురేపట్ల కవితక్క ఇంకింతెక్కో డోస్ వెంచి కేసీఆర్ సారును బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటెక్కోనే విమర్శిస్తదో సూడాలె మరి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story