Off The Record: కేసీఆర్ ఫ్యామిలీలో బిగ్ ఫైట్
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. కేటీఆర్, హరీష్‌రావులపై మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
Off The Record: కేసీఆర్ ఫ్యామిలీలో బిగ్ ఫైట్
Off The Record: ప్రత్యర్థులపై ఆరోపణల డోస్ పెంచారు కవిత. కాకపోతే కాంగ్రెస్, బీజేపీల కన్నా.. బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలే తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు ఒకే జెండా, ఒకే ఫ్యామిలీగా ఉన్న ఆ నేతలు.. ఇప్పుడు బద్ధ విరోధులుగా కత్తులు దూసుకోవడం, మాటల తూటాలు పేల్చడం తీవ్ర కలకలం రేపుతోంది.
తన టీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని అంటూనే.. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఆ 1400కోట్లు ఎక్కడివని, క్విడ్‌ప్రోకో ద్వారానే కేటీఆర్ ఆ డబ్బు సంపాదించారని కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు హరీష్‌రావుపైనా.. విరుచుకుపడ్డారు కవిత.
ఇంతకు కవిత మరోసారి బీఆర్ఎస్ను ఎందుకు టార్గెట్ చేశారు..? కవిత ఆరోపణలతో.. గులాబీ పార్టీకి జరిగే డ్యామేజ్ ఎంత..? కుటుంబ రాజకీయాలు బహిరంగ మాటల యుద్ధంగా మారాయా..? దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాజకీయ ఆయుధం దొరికినట్టేనా..? దీనిపై కేటీఆర్, హరీష్ కౌంటర్ ఉంటుందా..? వాచ్ దిస్.




