Big Debate: మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని దాచేస్తారా?: కత్తి పద్మ ఫైర్
Big Debate: అత్యాచారాలు జరుగుతున్నాయనే సాకుతో మహిళలను ఇళ్లల్లో దాచేస్తారా అంటూ గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలపై మహిళా సంఘం వ్యవస్థాపకురాలు కత్తి పద్మ మండిపడ్డారు.
Big Debate: మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని దాచేస్తారా?: కత్తి పద్మ ఫైర్
Big Debate: కేరళ గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలపై 'మహిళా సంఘం' వ్యవస్థాపకురాలు కత్తి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. సమాజంలో అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్న పేరుతో మహిళలను ఇళ్లల్లో దాచిపెట్టాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
హింసను అరికట్టే మార్గాలను వెతకాల్సింది పోయి, మహిళల స్వేచ్ఛను హరిస్తూ వారిని ఇంటికే పరిమితం చేయాలనుకోవడం పితృస్వామిక భావజాలానికి నిదర్శనమని కత్తి పద్మ పేర్కొన్నారు.
సమాజంలో నేరాలు జరుగుతున్నప్పుడు వాటిని ఎదుర్కొనేలా వ్యవస్థలను బలోపేతం చేయాలి తప్ప, మహిళలను బానిసలుగా లేదా వస్తువులుగా చూడటం అవాంఛనీయమని స్పష్టం చేశారు.
Next Story




