Jordar Varthalu: తాగుబోతుల కోసం సర్కారును ఎదిరిస్తున్న రాములు

Jordar Varthalu: హెచ్‌ఎంటివి జోర్దార్ వార్తల్లో రాములు తాగుబోతుల తరపున వింత డిమాండ్లు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 7:31 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: తాగుబోతుల కోసం సర్కారును ఎదిరిస్తున్న రాములు

Jordar Varthalu: రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో 'జోర్దార్ వార్తలు' ఫేమ్ రాములు తాగుబోతుల హక్కుల కోసం పోరాడుతానంటూ రంగంలోకి దిగారు. అబ్కారీ శాఖకు ఆదాయం పెంచడంలో తాగుబోతుల పాత్ర కీలకమని, అందుకే తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వింత డిమాండ్లు చేస్తున్నారు. ప్రభుత్వాలు బడ్జెట్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆశలు పెట్టుకుంటున్నాయని, ఆ ఆశలను తాగుబోతులు వమ్ము చేయకూడదని రాములు సెటైర్లు వేశారు. ఈ క్రమంలో తాగుబోతుల జేబులు ఖాళీ అవుతున్నాయని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story