Off The Record: కూటమి పై బాంబు పేల్చిన ఆది.. చాలా ఇబ్బంది పెడుతున్నారు

Off The Record: కూటమి ప్రభుత్వంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తిరుగుబావుటా. రాజీనామాకు సిద్ధమని సంచలన ప్రకటన.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 April 2026 1:46 PM IST
Off The Record
X

Off The Record: కూటమి పై బాంబు పేల్చిన ఆది.. చాలా ఇబ్బంది పెడుతున్నారు

Off The Record: ఐయామ్ ఫైర్, ఐయామ్ ఫైర్ అంటున్నారు ఆది నారా‍యణరెడ్డి. ప్రతిపక్షంపై కాదు.. సొంత కూటమిపైనే విల్లు ఎక్కుపెట్టారు. అసమ్మతి డోస్‌ను ఇంకాస్త పెంచి.ఇలా ఐతే కూటమి సర్కార్‌లో ఉండలేను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కోపంతో కూడిన ఆవేదనతో రగిలిపోతున్నారు. గతంలో కూటమిలో కమ్మనైన పాలన అన్న ఆది. ఇప్పుడేమే ఏకంగా రాజీనామా మాట వినిపించారు. ఇంతకు ప్రభుత్వంలో, బీజేపీలో ఆదికి వచ్చిన కష్టమేంటి? ఎందుకు కూటమి సర్కార్‌పై అసహనంతో ఉన్నారు. వాచ్ దిస్ స్టోరీ.

తాను అనుకున్నట్లుగా వ్యవస్థ సరిగా లేకపోతే రాజీనామా చేస్తానన్నారు. తాను కూడా కూటమిలో ఉన్నానని.. కానీ కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 100 రోజుల క్రితమే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరికొంతకాలం చూసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కానీ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. జమ్మలమడుగులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన నియోజకవర్గంలో పనులు కచ్చితంగా జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫ్యాక్షన్ కుటుంబం నుంచి అయన వయస్సు పెరుగుతున్నా డేరింగ్ డ్యాసింగ్ డైలాగ్స్ తో సంచలనాలకు తెరలేపుతూనే ఉన్నారు. తాను గెలవడానికి గానీ తాను అనుకున్నది జరిపించుకోవడానికి కానీ వెనక్కి తగ్గని నేత. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎందుకు అలా అంటున్నారు. వాచ్ దిస్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story