Big Debate: ఆన్‌లైన్‌లో తినే ఆహారం సేఫా?: ₹600 కడితే చాలు.. గంటల్లో ఫుడ్ లైసెన్స్!
Big Debate: ఆన్‌లైన్ ఫుడ్ నిజంగానే సురక్షితమేనా? ₹600 తత్కాల్ లైసెన్స్‌తో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు లేకుండానే క్లౌడ్ కిచెన్లు.. హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో షాకింగ్ విషయాలు.
Big Debate: ఆన్‌లైన్‌లో తినే ఆహారం సేఫా?: ₹600 కడితే చాలు.. గంటల్లో ఫుడ్ లైసెన్స్!
యాప్ ఓపెన్ చేయడం.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం.. నిమిషాల్లో ఇంటి ముందు వాలడం! ప్రస్తుతం నగరవాసుల జీవనశైలి ఇలాగే మారింది. అయితే, మనం ఎంతో ఇష్టంగా ఆన్‌లైన్‌లో తెప్పించుకుని తింటున్న ఆహారం అసలు ఎక్కడ తయారవుతోంది? అక్కడ కనీస పారిశుధ్యం ఉందా? ఆ కిచెన్లను అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అంటే 'లేదనే' సమాధానం వినిపిస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు మరియు యాప్‌ల అపరిమిత కమీషన్ల విధానం ఆన్‌లైన్ ఆహార నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్ వేదికగా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ అమలు చేస్తున్న 'తత్కాల్ లైసెన్స్ విధానం' ప్రస్తుతం క్లౌడ్ కిచెన్లకు పెద్ద రహదారిగా మారింది. కేవలం ₹600 రుసుము చెల్లిస్తే ఆన్‌లైన్‌లో రెండు గంటల్లోనే ఫుడ్ బిజినెస్ లైసెన్స్ వచ్చేస్తోంది. ఈ ప్రక్రియలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) నేరుగా వెళ్లి ఆ హోటల్ లేదా కిచెన్ ప్రాంగణాన్ని (Premises), పరిశుభ్రతను (Hygiene) తనిఖీ చేసే అవకాశమే ఉండటం లేదు. ఉదాహరణకు హనుమకొండలోనే ఎటువంటి తనిఖీలు లేకుండా 953 లైసెన్సులు జారీ కాగా, హైదరాబాద్‌లో ప్రతిరోజూ వందలాది మంది కొత్తగా ఈ ఆన్‌లైన్ యాప్‌లలో పార్టనర్లుగా చేరుతున్నారు.




