Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు!
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు!
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో అసలు సమస్య ఏమిటి...? ఎన్నికల సమయంలో టికెట్ విషయంలో మొదలైన విభేదాలా...? లేక నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం సాగుతున్న రెండు వర్గాల పోరా..? ఇప్పుడు ఇదే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదట ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి టికెట్ ఖరారైనప్పటికీ... చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మేఘారెడ్డికి టికెట్ దక్కింది. మేఘారెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా మారారు.
అయితే ఎన్నికల ఫలితాలతో వనపర్తి కాంగ్రెస్‌లో విభేదాలు ముగిసిపోలేదు. పదవులు, రాజకీయ ప్రాధాన్యత, నియోజకవర్గంలో ఎవరి మాటకు ఎక్కువ విలువ అనే అంశాల చుట్టూ ఇరువర్గాల మధ్య దూరం కొనసాగుతూనే వచ్చింది.
కొంతకాలంగా ఈ విభేదాలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. కానీ గోపాల్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమం ఆ మౌనానికి తెరదించి... మాటల తూటాలకు ఆజ్యం పోసింది. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనలాంటి వారికి కాకుండా... పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
టికెట్ విషయంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు చేయడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఇలాంటి పరిణామాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని, అభివృద్ధి కూడా కుంటుపడుతోందని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగకుండా సంబంధిత వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపకపోతే తాను కూడా మరో ‘జీవన్ రెడ్డి’లా మారాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. చిన్నారెడ్డి వ్యాఖ్యలు బయటకు వచ్చిన కొద్దిసేపటికే... ఎమ్మెల్యే మేఘారెడ్డి రంగంలోకి దిగారు.
చిన్నారెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు. గతంలో యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో... అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని కాదని ఆయన టికెట్ తెచ్చుకోలేదా అంటూ ప్రశ్నించారు. గెలిచే గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని... తాను టికెట్ దక్కించుకుని ఎన్నికల్లో గెలిచి చూపించానని అన్నారు.
ముఖ్యంగా టికెట్ కోసం తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో చిన్నారెడ్డి నిరూపించాలని సవాల్ విసరడం ద్వారా వివాదాన్ని మరింత తీవ్రం చేశారు. ఇక ఈ వివాదం కేవలం మాటల యుద్ధంతో ఆగలేదు. చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా మాట్లాడారని ఆరోపిస్తూ... ఎమ్మెల్యే మేఘారెడ్డి, వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక వాహనాల్లో కల్వకుర్తికి వెళ్లారు.
అక్కడ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించారు.
వనపర్తిలో ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదం కాదని... నియోజకవర్గంపై రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు పార్టీ సీనియర్ నేతగా, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ముందుకు తెస్తున్న చిన్నారెడ్డి వర్గం.. మరోవైపు ప్రజల తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి వర్గం.
ఇలా ఇరువర్గాలు తమ రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఆధిపత్య పోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారుతోంది. ఎవరి వెంట ఉండాలి..? ఎవరి మాట వినాలి..? స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి..? అనే అంశాలపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంటోందనే చర్చ జరుగుతోంది.
చిన్నారెడ్డి వ్యాఖ్యల వ్యవహారాన్ని.. ఢిల్లీ వరకు తీసుకెళ్లారు మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఢిల్లీలో తన అనుచరులతో కలిసి ఖర్గేను కలిసిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వాయిస్ రికార్డులు, మీడియా క్లిప్పింగులను అందజేసినట్లు తెలిపారు. వనపర్తిలో ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదం కాదని... నియోజకవర్గంపై రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరుగా కొందరు విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు పార్టీ సీనియర్ నేతగా, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ముందుకు తెస్తున్న చిన్నారెడ్డి వర్గం.. మరోవైపు ప్రజల తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి వర్గం. ఇలా ఇరువర్గాలు తమ రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఆధిపత్య పోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారుతోంది. ఎవరి వెంట ఉండాలి..? ఎవరి మాట వినాలి..? స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి..? అనే అంశాలపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంటోందనే చర్చ జరుగుతోంది.
చిన్నారెడ్డి వ్యాఖ్యల వ్యవహారాన్ని.. ఢిల్లీ వరకు తీసుకెళ్లారు మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఢిల్లీలో తన అనుచరులతో కలిసి ఖర్గేను కలిసిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వాయిస్ రికార్డులు, మీడియా క్లిప్పింగులను అందజేసినట్లు తెలిపారు. వనపర్తి కాంగ్రెస్‌లో సొంత గూటిలో నెలకొన్న రాజకీయ రగడపై.. అధిష్టానం గతంలో జోక్యం చేసుకుని సర్దుబాటు చేసినా ఇప్పుడు మళ్లీ అదే విభేదాలు బహిరంగ వేదికపైకి రావడం కాంగ్రెస్‌కు కొత్త సమస్యగా మారింది.
ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం ఇలాగే కొనసాగితే... దాని ప్రభావం స్థానిక రాజకీయాలపై పడే అవకాశం ఉందా...? అనే చర్చ జరుగుతుంది. వనపర్తి కాంగ్రెస్‌లో ఈ ఆధిపత్య పోరుకు అధిష్టానం ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుంది..? చిన్నారెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయా..? లేక మరోసారి ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ ఫార్ములాను అమలు చేస్తుందా..? ఇవే అంశాలు ప్రస్తుతం వనపర్తి కాంగ్రెస్‌లో ఇదే హాట్ టాపిక్ గా మారాయి.




