BurningTopic: భారత నేవీ చేతికి కొత్త అస్త్రం..శత్రు దేశాలను వణికిస్తున్న మోదీ
BurningTopic: భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయి.
BurningTopic: భారత నేవీ చేతికి కొత్త అస్త్రం..శత్రు దేశాలను వణికిస్తున్న మోదీ
BurningTopic: భారత నౌకాదళంలో మరో మూడు అత్యంత శక్తివంతమైన నౌకలు చేరాయి. ఐఎన్ఎస్దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్అగ్రయ్ నౌకలు 75 % పైగా స్వదేశీ తయారీ పరికరాలతో రూపొందాయి.. ఈ నౌకల చేరికతో భారత నౌకాదళం శక్తిసామర్థ్యాలు మరింతగా పెరిగాయి. ఈ మూడు ఆధునిక నౌకల్లో, దేని ప్రత్యేకత దానిదే. నీటిపైనే కాదు, సముద్రపు అడుగున కూడా భీకరంగా విరుచుకుపడే సామర్థ్యం ఐఎన్ఎస్దునగిరి, ఐఎన్ఎస్అగ్రయ్లది. మరోవైపు 'సముద్ర సర్వే మిషన్' కోసం సంశోధక్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మన దేశానికి అటు చైనా, ఇటు పాకిస్థాన్లతో ముప్పు పొంచి ఉండటం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో చైనా నావికా దళం విస్తరిస్తోంది. పాకిస్థాన్ సబ్‌మెరైన్స్ వాడుతోంది. ఈ నేపథ్యంలో మన స్వీయ రక్షణ కోసం యుద్ధ, సమాచార నౌకల అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి తరుణంలో మన నావికాదళంలోనికి ఒకేసారి మూడు నౌకలు చేరడం వల్ల సముద్ర రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది.
కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ఈ 3 నౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్‌ను నౌకలను కమిషన్ చేశారు. సముద్రశక్తి లేకుండా ఏ దేశం కూడా బలమైన శక్తిగా ఎదగలేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. అభివృద్ధి, భద్రత, సంపద సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని చెప్పారు. దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్ణయించడంలో బలమైన సముద్రతీర సామర్థ్యాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. నౌకా నిర్మాణ రంగానికి సంబంధించి భారత్ ఒక నూతన దృక్పథంతో ముందుకు సాగుతోంది. ఈ రంగానికి ప్రకటించిన రూ. 70,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీ కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు. దేశ సముద్ర భవిష్యత్తులో ఒక పెట్టుబడిగా భావిస్తున్నాం. భారతీయ పరిశ్రమలు, ఇంజనీర్ల నైపుణ్యం, కార్మికుల కృషి మన అతిపెద్ద బలం అని తెలిపారు ప్రధాని.
భారత నౌకా దళం చేపట్టిన 'ప్రాజెక్టు 17ఏ' ప్రొగ్రామ్‌లో భాగంగా తయారు చేసిన ఐదో యుద్ధ నౌక ఐఎన్ఎస్ దునగిరి'. ఉత్తరాఖండ్‌లోని 'దునగిరి' అనే హిమాలయ పర్వతం పేరు దీనికి పెట్టారు. ఐఎన్ఎస్ దునగిరిని ఇండియన్ నేవీకి చెందిన ఒక 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' డిజైన్ చేయగా, కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్' నిర్మించింది. గతంలో ఉన్న 'శివాలిక్' రకం యుద్ధనౌకల కంటే మెరుగైన వాటిని తయారు చేయడం కోసం 'ప్రాజెక్టు 17ఏ'ను ప్రారంభించారు. పాతతరం నౌకల స్థానంలో, హిందూ మహాసముద్రంలో అన్ని రకాల పనులు చేయగల కొత్త నౌకలను తీసుకురావాలనే ఆశయంతో ఇండియన్ నేవీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఐఎన్ఎస్ దునగిరి నౌక శత్రువుల కంటికి కనపడకుండా దాడులు చేయగలదు. దీనిలో అత్యాధునిక సెన్సార్లు, ఆటోమేటిక్స్ సిస్టమ్స్, శక్తిమంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఈ నౌక ఒకే సమయంలో శత్రు విమానాలను, ఓడలను, జలాంతర్గాములను ఎదుర్కొంటూనే, చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
ఈ ఐఎన్ఎస్దునగిరి దాదాపు 149 మీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 6,600 టన్నుల బరువు మోయగలదు. దీనికి శత్రువుల కంట పడకుండా తప్పించుకునే టెక్నాలజీతోపాటు. ఇందులో ఒక అద్భుతమైన 'కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్' ఉంది. దీనిలో అధునిక రాడార్లు, నీటి లోపల వెతికే సెన్సార్లు, బ్రహ్మోస్ సూపర్ ఫాస్ట్ క్షిపణులు, గాల్లోకి దూసుకెళ్లే మిస్సైళ్లు, టార్పెడోలుపెద్ద నేవల్ గన్స్ ఉన్నాయి. వీటి ద్వారా శత్రువుల ఓడలను, జలాంతర్గాములను, విమానాలను సులువుగా కూల్చేయగలదు. ఎన్ఐఎస్దునగిరి నౌకపై నుంచి హెలికాప్టర్లను కూడా నడపవచ్చు. సముద్రంలో నిఘా పెట్టడానికి, శత్రువులను వేటాడడానికి, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి ఇది పనికివస్తాయి.ఆరేబియా సముద్రం నుంచి పసిఫిక్మహాసముద్రం వరకు గట్టి నిఘా పెట్టవచ్చు.. హిందూ మహాసముద్రంలో చైనా లాంటి ఇతర దేశాల నావికాదళాల కదలికలు పెరుగుతున్న సమయంలో ఈ ఐఎన్ఎస్దునగిరి సేవలు మనకు మరింతగా ఉపయోగపడతాయి.
ఐఎన్ఎస్సంశోధక్ను సముద్రంపై తేలియాడే పరిశోధనశాలగా చెప్పవచ్చు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నాయి. దీన్ని 'నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో' డిజైన్ చేయగా, కోల్‌కతాలోని జీఆర్ఎస్ సంస్థ నిర్మించింది. సముద్రపు అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేయడం, ఓడలు ప్రయాణించడానికి సురక్షితమైన మార్గాలను కనుగొనడం, సముద్రపు డేటాను సేకరించడం, నావికాదళ ఆపరేషన్లకు అవసరమైన కచ్చితమైన సమాచారాన్ని అందించడం దీని ప్రధాన విధులు. ఐఎన్ఎస్సంశోధక్నౌక యుద్ధం వస్తే, మన యుద్ధనౌకలు సముద్రంలో సురక్షితంగా తిరగడానికి, ఎదురుదాడి చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఇది ఇస్తుంది. నావికాదళ కమాండర్లకు మాత్రమే కాకుండా, సాధారణ వ్యాపార ఓడలకు, రేవులకు కూడా ఉపయోగపడుతుంది. విపత్తులు వచ్చినప్పుడు సహాయ చర్యల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ నౌక నౌక సుమారు 110 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది 3,400 టన్నుల బరువు మోయగలుగుతుంది. గంటకు 33 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
ఐఎన్ఎస్అగ్రయ్ అర్నాలా-క్లాస్‌కు చెందినది. ఇది తక్కువ లోతు ఉన్న, తీరప్రాంత జలాల్లో దాక్కునే శత్రువుల జలాంతర్గాములను వెతికి వేటాడగలదు. ఇలాంటి చిన్న నౌకలు దునగిరి లాంటి పెద్ద నౌకలకు సముద్రంలో పూర్తి రక్షణను అందిస్తాయి.ఐఎన్ఎస్అగ్రయ్ 77 మీటర్ల పొడవు, 900 టన్నుల బరువు ఉంటుంది. ఇది గంటకు దాదాపు 46 కి.మీ వేగంతో దూసుకుపోగలదు. దీనిలో మన దేశంలోనే తయారైన యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంఛర్లు, టార్పెడోలు, సోనార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇండియన్ నేవీలో 'వాటర్‌జెట్' తో నడిచే అతిపెద్ద నౌకలు ఇవే కావడం విశేషం.తీరప్రాంతాల్లోని లోతు తక్కువ నీటిలో జలాంతర్గాములను కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చేపల బోట్లు, వ్యాపార ఓడలు, తీరప్రాంత సందడి వల్ల చాలా శబ్గాలు వస్తాయి. అలాంటి చోట్ల శత్రువులను వేటడానికే 'అగ్రయ్' లాంటి చిన్న, వేగవంతమైన నౌకలను తయారు చేశారు. మన పోర్టులను, నావికాదళ స్థావరాలను రక్షించడమే ఐఎన్ఎస్అగ్రయ్ పని.




