Jordar Varthalu: నడీరోడ్డు మీదే పొట్టుపొట్టు తిట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు
Jordar Varthalu: మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖ మరియు అటవీ శాఖ అధికారుల మధ్య నడిరోడ్డుపై జరిగిన గొడవ వైరల్గా మారింది.
Jordar Varthalu: నడీరోడ్డు మీదే పొట్టుపొట్టు తిట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు
Jordar Varthalu: సూశిర్రానుల్లా.. నడీ రోడ్డు మీదనే ఎట్ల వాదులాడుకుంటున్నరో.. ఉత్త మాటలేగాదు., మాటామాటా వెరిగి కొట్టుకునే దాంక పోయింది వీళ్ల కథ. మరిగ ముచ్చటేందంటే., కరెంటు తీగలకు అడ్డమత్తున్న శెట్ల కొమ్మలను నరికెయ్యాల్నని కరెంటోళ్లు.. లేదు లేదు అట్లెట్ల నరుకుతరు.. మా పర్మీషన్ లేకుంట మాకు శెప్పకుంట శెట్లను కొట్టే అధికారం మీకెక్కడిది అని ఫారెస్టు అధికారులు.. ఇట్లా రొండు డిపార్టుమెంట్ల ఉజ్జోగుల నడ్మ మాటల యుద్దం నడ్శింది. కొట్టుకునుడొక్కటే తక్కోగనీ., కొట్టుకున్నంత పన్జేశిర్రు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ల జరిగిందిది.
విద్యుత్ శాఖ, అటవీ శాఖ నడ్మ సమన్వయం కరువయ్యేటాళ్లకే ఇట్ల జరిగిందని కొందరంటుంటే., వాళ్లు సర్కారు అధికారులు అనుకుంటున్నరా.. లేకుంటె రౌడీ గుండెగాళ్లు అనుకుంటున్నరా అని కొందరు.. సర్కార్ ఉజ్జోగులే గట్ల కొట్టుకునే పరిస్థితి ఉంటే ఇగ కామన్ జనాల పరిస్థితి ఏందని ఇంకొందరు అంటున్నరు. ఏందో ఏమోనుల్లా.. జనాలకు ఇబ్బందులు లేకుంట జెయ్యాల్నంటే ఇట్ల ఇంకో ప్రభుత్వ శాఖనే కాళ్లల్ల కట్టెలు వెట్టినట్టే జేస్తే ఇగ జనాల గోసలు ఎక్కడ తీరుతయి జెప్పుర్రి. మరిగ వాల్లు ఎవ్వలి డ్యూటీ ఆళ్లు సక్కగనే జేస్తున్నరుగావచ్చుగనీ., గిట్ల వాదులాడుకునుడు మాత్రం అస్సల్కే పద్దతిగాదు పోండ్రి. ఏమంటరుల్లా జనాలూ.




