Jordar News: థియేటర్ ఓనర్ కు షాకిచ్చిన సినిమా ప్రేక్షకులు

Jordar News: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ క్యాంటీన్‌లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2026 7:37 AM IST
Jordar News
X

Jordar News: థియేటర్ ఓనర్ కు షాకిచ్చిన సినిమా ప్రేక్షకులు

Jordar News: ఇగో ఈడ కానస్తున్న నోట్లు మాంచి కడక్ మీదున్నయ్ గనీ., ఇవ్వి పక్కాగ దొంగ నోట్లు. అది గుడ ఎక్కడ బైటవడ్డయని అనుకుంటున్నరు. సిన్మా థియేటర్ల. అవునుల్లా.. పల్నాడు జిల్లా నరసరావుపేటలున్న కాసు మల్టీప్లెక్స్ థియేటర్లుండే క్యాంటీన్ల అల్పాహారం కొనుక్కోని నకిలీ 500 రూపాల నోట్లను శేతిల వెట్టి పొయ్యిర్రట ప్రేక్షకులు. సిన్మా నడ్మిట్ల ఇంటర్వెల్ టైముల ఒక్కటేపారి మస్తు మంది ఎగవడేటాళ్లకు వాళ్లకు సుతం ఏం సముజుగాలేదు.

నోట్లను తీస్కోని కౌంటర్లేస్కున్నరు. అటెంక పరీచ్చవట్టి సూస్తె దొంగనోట్లని తేలింది. ఐదు వందల రూపాల నోట్లల్ల మూడు దొంగనోట్లను గుర్తువట్టిర్రు. ఇగీ నోట్లు ఎవ్వలిచ్చిర్రు, ఏందనేది తెల్సుకోడానికి సీసీ కెమ్రాలన్ని తిర్రేశిమర్రేశి సూస్తున్నరటగనీ., గంత మందిల ఆగమాగం ఉంటది, ఎవ్వలనేది ఎట్ల దొర్కుతదిగనీ., మరిగ దొంగనోట్లను మార్సుకోడానికి వాళ్లు సిన్మా టాకీసునే ఎందుకు వాడుకున్నరో ఏందో పోండ్రి.

మరిగ సిన్మా టాకీసులల్ల పాప్ కార్న్ కు, కూల్ డ్రింక్స్ కు అడ్డగోలుగ పైసలు వసూలు జేస్తున్నరన్న కోపంతోని దొంగనోట్లు ఇచ్చిపొయ్యిర్రా, లేకుంటె ఇచ్చినోళ్లకు సుతం ఏం నోట్లు ఇచ్చిర్రనేది తెల్వకుంటనే ఇట్ల జేశిర్రా అనేది మాత్రం ఇంకా గుడ సన్పెన్స్ లెక్కనే ఉన్నదిగనీ., నకిలీ నోట్ల ముచ్చట్ల మాత్రం వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగ ఉండాల్ననైతే అక్కడి పోలీసులు గట్టిగనే జెప్తున్నరు. మరిగ పబ్లిక్కు.. మీరు సుతం శానా జాగ్రత్తగ ఉండుర్రి. ఒక్కపారి మీ శేతికి దొంగ నోట్లు అచ్చినయా మీ రూపాలన్ని శిత్తు కాయితాలతోని సమానం అయిపోతయి గావట్టి., జర్ర మంచిగ సూస్కోండ్రి. ఏమంటున్నం.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story