OFF THE RECORD: నేనున్నానంటూ భరోసా.. మునుగోడులో ఈఎల్వీ భాస్కర్ సేవా జోరు!
OFF THE RECORD: మునుగోడులో ఈఎల్వీ భాస్కర్ సేవా కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. విద్య, వైద్యం, సంక్షేమంలో ఆయన సేవలు మరియు రాజకీయాల్లో చర్చనీయమవుతున్నాయి.
OFF THE RECORD: నేనున్నానంటూ భరోసా.. మునుగోడులో ఈఎల్వీ భాస్కర్ సేవా జోరు!
OFF THE RECORD: నల్గొండ జిల్లా మునుగోడులో ఇప్పుడు ఓ కొత్త ఆశాకిరణం కనిపిస్తోందట. దశాబ్దకాలంగా తిష్ట వేసిన అనేక సమస్యలపై ఓట్ల రాజకీయం చేస్తున్న నేతలకు దీటుగా.. నేనున్నానంటూ ELV భాస్కర్ అనే వ్యక్తి ఆపద్బాంధవుడిగా భరోసా ఇస్తున్నారట.
మునుగోడువాసుల్లో వెలుగులు నింపడానికి ఉదయించే సూర్యుడిలా ఆశలు చిగురింపజేస్తున్నారట. తనలోని నవీన ఆలోచనలు, సేవా దృక్పథంతో ముందుకురావడంతో ఇప్పుడు మునుగోడులో ఎవరి నోట విన్నా ఆయన పేరే రీసౌండ్ చేస్తోందట.
ఈఎల్వీ భాస్కర్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో మునుగోడు నియోజకవర్గ ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన భాస్కర్ ఓ వ్యాపారవేత్త. ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ స్థాపించి ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
గట్టుప్పల్ మండలంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
పండుగలు, పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే స్థానిక యువజన సంఘాలకు అండదండగా ఉంటున్నారు. మునుగోడు వ్యాప్తంగా మర్రిగూడ, చౌటుప్పల్, గట్టుప్పల్ వంటి మండలాల్లో భాస్కర్ పుట్టినరోజు వేడుకలను ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించడం నియోజకవర్గంలో ఆయనకున్న ప్రజాదరణను చెప్పకనే చెబుతోంది.
క్షేత్రస్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు, స్థానిక రాజకీయ వర్గాల్లోనూ ఈఎల్వీ భాస్కర్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మునుగోడులో భాస్కర్ ఏది చేసినా రాజకీయ చర్చ జరుగుతోందట. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయకుండా..
తనకు తోచిన విధంగా మునుగోడుతోపాటు దేవరకొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో రాజకీయంగా కొత్త ఒరవడికి భాస్కర్ నాంది పలికారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.
ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో పక్షవాతంతో బాధపడుతున్న వారికి రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి కేరళలో అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం సొంత డబ్బులతో బస్సులు కొని ఇస్తున్నారు. అంతేకాక విద్యార్థులకు సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లకు రంగులు వేయిస్తు్న్నారు. క్రీడా సామగ్రి, మెడికల్ క్యాంపులు, ఉద్యోగ మేళాలు.. ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ మునుగోడు వాసుల మనసు దోచుకుంటున్నారు. దీంతో ఇప్పటి దాకా ఎమ్మెల్యేలు కేవలం మాటలకే పరిమితమై ఓట్ల రాజకీయాలు చేసేవారని, భాస్కర్ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఏ ఎన్నికలూ లేకపోయినా సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న భాస్కర్‌కు జనం పార్టీలకు అతీతంగా జై కొడుతున్నారట. సామాన్య కుటుంబంలో జన్మించిన భాస్కర్.. బెంగళూరులో విద్యా, రియల్ ఎస్టేట్ రంగాల్లో నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలో కన్న తల్లిదండ్రులు, పుట్టిన ఊరును మర్చిపోకుండా మునుగోడు పాలిట ఆశాకిరణంలా నిలుస్తున్నారు.
కన్న తల్లిదండ్రుల పేరు వచ్చేలా.. ఇరుగదిండ్ల లక్ష్మీ వీరయ్య భాస్కర్.. ELV భాస్కర్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక మునుగోడుకు శాశ్వత పరిష్కారం కోసం డిండి ఎత్తిపోతలలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి సాగు, తాగు నీటి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారట.
తన కార్యక్రమాలు అన్నీ ప్రజల కోసమేనని.. రాజకీయాల కోసం కాదనీ తేల్చిచెబుతున్నారు. దీంతో మునుగోడులో భాస్కర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది.




