Burning Topic: దూసుకొస్తున్న ఎబోలా వైరస్.. 220 మంది మృ*తి..
Burning Topic: ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కలకలం! 220 మంది మృతి, వేలల్లో అనుమానిత కేసులు. భారత్ అప్రమత్తం, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా.
Burning Topic: దూసుకొస్తున్న ఎబోలా వైరస్.. 220 మంది మృ*తి..
Burning Topic: కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ అంతటి తీవ్ర ఆందోళనలకు కారణమైంది ఎబోలా వైరస్.. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ఇదో సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా కేసులు నమోదవుతున్నాయి. కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. ఈ వైరస్ కారణంగా 220 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు 101 కేసులు నిర్ధారణ అయ్యాయని.. మరో 3,000 మంది కాంటాక్ట్‌ల గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ చెప్పింది. పొరుగు దేశం ఉగాండాలో ఏడు ఎబోలా కేసులు నమోదు కాగా, రాజధాని కంపాలాలో ఒకరు మృతి చనిపోయారు. కాంగోలో ఏప్రిల్ చివరి వారంలో మొదైన ఎబోలా వైరస్ కేసులు మే మూడో వారం నాటికి ఉగండాకు వ్యాపించాయి. ఉగండా వెంటనే తన సరిహద్దులను మూసేసింది. ప్రస్తుతం గోమా, కంపాలా నగరాల్లో పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తోంది.
ఏప్రిల్ మాసంలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఓ రైతు వింతైన జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో చనిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే అతని కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన నర్సు కూడా అదే లక్షణాలతో చనిపోయారు. స్థానిక ల్యాబ్ టెక్నీషియన్లు వెంటనే రక్తం నమూనాలను సేకరించారు. అయితే వారి వద్ద ఉన్న టెస్టింగ్ కిట్లు కేవలం 'జైర్' అనే పాత ఎబోలా వైరస్ స్ట్రెయిన్‌ను మాత్రమే గుర్తించగలవు. దీంతో వారి పరీక్షల్లో 'నెగిటివ్' అని వచ్చింది. దీంతో అధికారులు దీనిని సాధారణ టైఫాయిడ్, మలేరియా అని భావించారు. కానీ ఈ వైరస్
అత్యంత ప్రమాదకరమైన 'బుండిబుగ్యో' స్ట్రెయిన్ అని వారికి తెలియలేదు. ఇటూరిలో బుండిబుగ్యో స్ట్రెయిన్‌ను పరీక్షించే పరికరాలు లేకపోవడంతో, వారు నమూనాలను రాజధాని కిన్షాసాకు పంపాల్సి వచ్చింది. నిధుల కొరతతో ఆ నమూనాలను ఐస్ బాక్సులలోరవాణా చేయలేకపోయారు. ఫలితంగా కిన్షాసా చేరేసరికి ఆ శాంపిల్స్ పాడైపోయాయి.
మళ్లీ కొత్త నమూనాలు సేకరించి, పరీక్షించి, అది ఎఎబోలా బుండిబుగ్యో స్ట్రెయిన్ అని నిర్ధారించేసరికి మే 15 అయిపోయింది. అప్పటికే జరగకూడని నష్టం కూడా జరిగిపోయింది. సకాలంలో గుర్తించలేకపోవడంతో భారీ నష్టం జరగిపోయింది. ఈలోగా ఎబోలా వేగంగా వ్యాపించింది.ప్రపంచవ్యాప్తంగా ఎబోలా చికిత్సకు ఇచ్చే 'ఎర్బోవో' వ్యాక్సిన్ కేవలం 'జైర్' స్ట్రెయిన్‌పై మాత్రమే పనిచేస్తుంది. 'బుండిబుగ్యో' స్ట్రెయిన్‌పై అది ప్రభావం చూపించలేదు. ఈ స్ట్రెయిన్‌కు అధికారికంగా ఎలాంటి వ్యాక్సిన్ , యాంటీవైరల్ డ్రగ్స్ లేవు. దీని బారిన పడిన రోగుల్లో మరణాల రేటు 33% కంటే ఎక్కువగా ఉంది. అంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు అత్యవసరంగా కొత్త వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినప్పటికీ, అవి పూర్తిగా అందుబాటులోకి రావడానికి కనీసం మరికొంత కాలం పడుతుంది.
కాంగోలాంటి పేద దేశం ఈ సమస్య ఎదుర్కోవడానికి అసలు కారణం డొనాల్డ్ ట్రంప్ అనే వాదన ఉంది. అమెరికా గతంలో అంతర్జాతీయ సహాయ సంస్థ - యూఎస్ ఎయిడ్ ద్వారా ఆఫ్రికా దేశాల్లో ప్రమాదకరమైన వైరస్‌లను కనిపెట్టడానికి "ప్రిడిక్ట్" కార్యక్రమాలను నడిపేది. హెల్త్ వర్కర్లకు కొత్త వైరస్‌లను గుర్తించే శిక్షణ ఇచ్చేవారు. ల్యాబ్‌లకు అన్ని రకాల ఎబోలా స్ట్రెయిన్లను పరీక్షించే మల్టీ-ప్లెక్స్ కిట్లను సరఫరా చేసేవారు. అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచేవారు. కాగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే "అమెరికా ఫస్ట్" పేరుతో విదేశీ సహాయ నిధులను భారీగా తగ్గించారు.. దీంతో నిధులు లేక కాంగోలోని అనుభవజ్ఞులైన నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. ల్యాబ్‌లలో ఆధునిక కెమికల్స్ కొరత ఏర్పడింది. దీనిపై అమెరికా విదేశాంగ కార్యదర్శి స్పందిస్తూ.. అమెరికా మొదటి ప్రాధాన్యత దేశ సరిహద్దులను కాపాడుకోవడం.. ఒక్క ఎబోలా కేసు కూడా తమ కా గడ్డపైకి రాకుండా చూసుకోవడం అన్నారు.
రూబియో వ్యాఖ్యలపై ఆఫ్రికా దేశాలను మరింత బాధించాయి. అమెరికా కాంగో దేశానికి ఇచ్చే ఆరోగ్య నిధులు ఒకే సంవత్సరంలో 33 మిలియన్ డాలర్ల నుండి 10 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అమెరికా తీరుపై విమర్శలు రావడంతో తాను గతంలో కట్ చేసిన నిధుల కంటే రెట్టింపు మొత్తం, అంటే 23 మిలియన్ డాలర్లను అత్యవసర సహాయంగా ప్రకటించింది. అరోగ్య సంక్షోభం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. వైరస్‌లు ఏ దేశంలో పుట్టినా ప్రపంచమంతా వ్యాపిస్తాయి. గతంలో కరోనా విషయంలోనూ అదే జరిగింది. తాను నిధులకు కోత విధించిన కారణంగా ఏర్పడ్డ ఎబోలా సంక్షోభం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగోకు అత్యవసరంగా వైద్య పరికరాలను సరఫరా చేసి పర్యవేక్షిస్తోంది. ఎబోలా తీవ్రత ఉన్న పేద దేశాలకు ప్రపంచ దేశాలు ఆర్థికంగా, వైద్య సామాగ్రి పరంగా మరింత సహాయం అందించాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెస్ కోరారు.
ఆఫ్రికాలో ఎబోలా విజృంభణ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటివరకు ఎటువంటి నిర్ధారిత ఎబోలా వైరస్ కేసు నమోదు కాలేదు. అయినప్పటికీ విమానాశ్రయాలలో కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, ఆఫ్రికాలోని ప్రభావిత దేశాలకు వెళ్ళవద్దని కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎబోలాపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించింది. వ్యాధిని గుర్తించడానికి పుణెలోని ల్యాబ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల కాంగో దేశం నుండి వచ్చిన గుజరాత్ వ్యాపారవేత్తకు ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించగా, అతని టెస్ట్ రిపోర్ట్ నెగటివ్‌గా వచ్చింది. బెంగళూరులోనూ ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో.. వైద్య విభాగం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.




