Jordar News: పట్టపగలే ఫుల్లుగా తాగి బస్సు నడిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే
Jordar News: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మద్యం మత్తులో బస్సు నడిపిన డ్రైవర్ తిరుమలేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jordar News: పట్టపగలే ఫుల్లుగా తాగి బస్సు నడిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే
Jordar News: బస్సు చాల్జేసుడుకు ముదాలే లిక్కర్ కడ్పుల లోడు చేశినట్టున్నడు. స్టీరింగు తింపుడుకు ముదాలే లిక్కర్ కీస మూత తింపినట్టున్నడు. గేర్ ఏసుడుకు ముదాలే పుర్సతిగ ఓ పెగ్గేశినట్టున్నడు. బిరేకు తొక్కుడుకు ముదాలే బరాండీ గుద్దినట్టున్నడు. ప్రయాణికుల క్షేమమే మా బాధ్యత అని ఆర్టీసొల్లు శెప్తుంటె.. బస్సెక్కిన ప్రయాణికులను పర్శాన్ చేసిండుల్ల..
ఇన్నరు గదా. డెబ్బయ్ రీడంగు. అంటే తాగింది తక్వేం గాదు.. రిమ్మ తాగిండు.. గంతగనం తాగి బస్సు నడ్పుతాండంటె ఎట్లున్నది సూడుర్రి వీని తమాషా. పర్మనెంటు డ్రైవరయితె కాదట గని, ఐనా ఎవ్వలయితే ఏందుల్ల, తాగి బస్సు నడ్పి టక్కరు చేస్తె పొయ్యేది పబ్లిక్కు పానాలే గదా. తాగిన ముచ్చట ముందు పసిగట్టి ప్రయాణికులు పోలీస్‌లకు మత్లావ్ చేత్తె పోలీస్లచ్చి నోట్లె గొట్టెంబెట్టి రీడింగు సూశి తాగింది నిజమేనని కన్ఫామ్ జేశి బస్సును బస్టాండ్ల నిల్పేశిర్రు. మరి అటెంక ఏమైందో గనుల్ల.. మెదక్ జిల్లా నర్సాపూర్ కాడ అయ్యిందిట్ల. డ్రైవరు పేరు తిరుమలేష్ అట. డ్రైవర్ తాగి బస్సు నడ్పుతున్న టైంల బస్సుల డెబ్బైమంది ప్రయాణికులు ఉన్నరట. ఆళ్ల గాచారం మంచిగుండి తాగిన ముచ్చట పసిగట్టిర్రు గని లేకుంటే ఈ తాగువోతోడు శెయ్యంగ ఎట్లవ్వునో ఏమో.




