రేవంత్ రెడ్డి గారూ.. మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?: ధరణి లోపాలు, 'భూభారతి'పై బీజేపీ నేత వెంకట్ రెడ్డి సూటి ప్రశ్న!

News Analysis: ధరణి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని విదేశాల నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది.

Arun Chilukuri
Published on: 7 July 2026 11:34 AM IST
రేవంత్ రెడ్డి గారూ.. మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?: ధరణి లోపాలు, భూభారతిపై బీజేపీ నేత వెంకట్ రెడ్డి సూటి ప్రశ్న!
X

రేవంత్ రెడ్డి గారూ.. మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?: ధరణి లోపాలు, 'భూభారతి'పై బీజేపీ నేత వెంకట్ రెడ్డి సూటి ప్రశ్న!

News Analysis: తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున భూమార్పిడులు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉన్న వారి సంతకాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్లు ఏమీ లేకుండానే ఇక్కడి భూములు చేతులు మారడంపై కలెక్టర్లు సైతం సీరియస్ అయ్యారు. దీనికి కారకులెవరో తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంటీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో బీజేపీ సీరియస్ ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ చర్చలో పాల్గొన్న బీజేపీ సీరియస్ నాయకులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అనేది గొంగడిలో పేలేరుకున్నట్లుగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సర్వే నెంబర్లు తప్పుగా రావడం, భూమి విస్తీర్ణం తగ్గిపోవడం వంటి సమస్యలపై దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల ఖాతాలు కూడా ధరణిలో మాయమయ్యాయని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story