Jordar News: ఈ అన్న చేసిన పనికి హాట్స్ ఆఫ్..

Jordar News: హైదరాబాద్ నాగోల్‌లో దొరికిన రూ. 2 లక్షలను నిజాయితీగా పోలీసులకు అప్పగించిన జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలీ. అతడిని సన్మానించిన నాగోల్ పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2026 7:14 AM IST
Jordar News
X

Jordar News: ఈ అన్న చేసిన పనికి హాట్స్ ఆఫ్..

Jordar News: ఇగో ఈడ పోలీసు సారు సన్మానం జేస్తున్న తమ్ముని గురించేనుల్లా ముచ్చట. ఈ తమ్ముని పేరు షేక్ వలీ. 4వ తరగతి మాత్రమే చదివిండు. కనీ., నిజాయితీల మాత్రం నూటికి నూరు మార్కులు సాధించిండని మస్తు తారీఫ్ జేస్కుంట సన్మానం జేస్తున్నరు. మరిగ ముచ్చటేందంటే., ప్రశాంత్ అనేటాయన పన్జేస్తున్న ఫార్మసీకి సంబంధించిన ఐదు లక్షల రూపాలను బ్యాంకుల డిపాజిట్ చేద్దామని పోతున్నడట. ఆ పైసలను బ్యాగుల పట్కపోతుంటే., నడ్మిట్ల రొండు లక్షల రూపాలు కిందవడిపోయినయట. ఇగ అదేయాల్ల అటుదిక్కు నుంచి పోతున్న షేక్ వలీ అనే ఈ తమ్మునికి ఆ పైసలు దొర్కుతే., అవ్విటిని పట్కోని ఇంటికి పోదామని అన్కోకుంట ఆ పైసలను తీస్కోని నాగోల్ పోలీస్ స్టేషన్‌కు పోయి జరిగిన ముచ్చట జెప్పిండట. అంతేనా తమ్మీ..

అది ముచ్చట. పైస కండ్లవడ్డా మూడో కంటికి తెల్వకుంట మాయం జేస్తున్న ఈరోజులల్ల నిజాయితీగ దొర్కిన పైసలను ఎన్కకిచ్చినందుకు నాగోల్ పోలీసులు సన్మానం జేశి రివార్డు గుడ ఇచ్చిర్రు. చదువు తక్కువైనా సంస్కారం ఎక్కువ ఉన్న వలీని పోలీసులంత తారీఫ్ జేశిర్రు. ఇగ దీని మీద నాగోల్ సీఐ సారు గిట్ల మాట్లాడుకచ్చిండు.

పరాయి సొమ్ము మట్టిబెడ్డలతోని సమానం అనుకోని అందరు ఇట్లనే నిజాయితీగ ఉంటే., సమాజంల ఈ దొంగతానాలు, దోపిడీలు అనేటియే జరుగయి. అసొంటి రోజులు తొందర్లనే రావాల్నని మన జోర్దార్ తర్పున గుడ కోరుకుంటున్నం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story