Jordar Vathalu: ఏం పనులు చేస్తున్నరు అసలు.. మహిళల లెక్కనే తిట్టాలనిపిస్తుంది

Jordar Vathalu: తెలంగాణలోని ఆర్టీసీ బస్టాండ్ల దుస్థితిపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 9:27 AM IST
Jordar Vathalu
X

Jordar Vathalu: ఏం పనులు చేస్తున్నరు అసలు.. మహిళల లెక్కనే తిట్టాలనిపిస్తుంది

Jordar Vathalu: రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్ల అధ్వాన్న పరిస్థితిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన 'ప్రజాపాలన-ప్రగతిపాలన' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడి సౌకర్యాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్టాండ్ల పరిస్థితి చూస్తుంటే తనకు తీవ్రమైన కోపం వస్తోందని, ఒక సామాన్య మహిళకు వచ్చే కోపంతో తిట్టాలనిపిస్తోందని కూనంనేని వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో మొత్తం 143 బస్టాండ్లు ఉన్నాయి. ఒక్కో బస్టాండ్‌కు ఐదేసి కోట్ల రూపాయలు కేటాయించినా మొత్తం 700 కోట్లు అవుతుంది. ఈ మాత్రం ఖర్చు చేయలేరా?" అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story