Big Debate: కొండా సురేఖ వివాదం వేళ కాంగ్రెస్‌లో రాజుకున్న మరో కొత్త చర్చ!

Big Debate: కాంగ్రెస్‌లో బయటోళ్ల పెత్తనంపై కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హెచ్‌ఎంటీవీ బిగ్ డిబేట్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 12:21 PM IST
Big Debate
X

Big Debate: కొండా సురేఖ వివాదం వేళ కాంగ్రెస్‌లో రాజుకున్న మరో కొత్త చర్చ!

Big Debate: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలు, అంతర్గత కుమ్ములాటలపై 'హెచ్‌ఎంటీవీ' నిర్వహించిన 'బిగ్ డిబేట్' చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు.

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల మధ్య కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. పార్టీలోకి బయటి నుంచి వచ్చిన వాళ్లు వచ్చి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తిని బట్టబయలు చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పరిమితులు ఉంటాయని, పార్టీ అధికార ప్రతినిధులుగా అధిష్టాన నిర్ణయాలకే కట్టుబడి ఉంటామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణా సంఘం ఇప్పటికే అధిష్టానానికి నివేదిక పంపిందని, దీనిపై అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిందని ఆయన సమర్థించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story