News Analysis: ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా బీఆర్‌ఎస్‌ సహకరించడం లేదు

News Analysis: దళితులపై అనుచిత వ్యాఖ్యల నిరసనపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో కాంగ్రెస్ నేత వెంకట్ నాయక్ చేసిన వ్యాఖ్యలు.

Arun Chilukuri
Updated on: 9 Sept 2026 1:00 PM IST
News Analysis
X

News Analysis: ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా బీఆర్‌ఎస్‌ సహకరించడం లేదు

News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరియు తదనంతర పరిణామాలపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో కాంగ్రెస్ నాయకుడు వెంకట్ నాయక్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రతిపక్షాలు సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా నల్ల దుస్తులపై స్లోగన్లు రాసుకుని నిరసన తెలపడం సరైంది కాదన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు సద్వినియోగం చేసుకోకుండా సభ నుంచి పారిపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేరని, ఇప్పుడు కూడా సభకు రాకుండా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story