News Analysis: 600 కోట్ల టెండర్లలో 2000 కోట్ల అవినీతి ఎట్లా సాధ్యం? బీఆర్ఎస్‌కు ఇంకితజ్ఞానం లేదు: కాంగ్రెస్ ఫైర్!

News Analysis: తెలంగాణ గురుకులాల టెండర్లలో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

Arun Chilukuri
Published on: 3 July 2026 11:29 AM IST
News Analysis
X

News Analysis: 600 కోట్ల టెండర్లలో 2000 కోట్ల అవినీతి ఎట్లా సాధ్యం? బీఆర్ఎస్‌కు ఇంకితజ్ఞానం లేదు: కాంగ్రెస్ ఫైర్!

News Analysis: తెలంగాణ గురుకుల పాఠశాలల టెండర్లలో వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) చేస్తున్న ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హెచ్ఎంటీవీ (hmtv) ప్రత్యేక చర్చా వేదికలో కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ లింగం యాదవ్ పాల్గొని.. బీఆర్ఎస్ నేత హరీష్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లోనే కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గురుకులాల టెండర్లపై బీఆర్ఎస్ చెప్తున్న లెక్కలను లింగం యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు. హరీష్ రావు ఏమో రూ.2000 కోట్ల కుంభకోణం అంటారని, ప్రవీణ్ కుమార్ ఏమో రూ.3000 కోట్ల స్కామ్ అంటారని ఎద్దేవా చేశారు.

"రాష్ట్రంలో అసలు గురుకులాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచిన మొత్తం టెండర్ల విలువ కేవలం రూ.1143 కోట్లు. అందులో సింహభాగం అంటే రూ.500 కోట్ల రూపాయల టెండర్లను ప్రభుత్వాధీనంలో నడిచే 'లిడ్ క్యాప్', చేనేత సంస్థ 'టెస్కో'లకే కేటాయించాము. ఇక మిగిలింది కేవలం రూ.600 కోట్ల రూపాయల ఓపెన్ టెండర్లు మాత్రమే. అసలు మొత్తం టెండర్ల విలువ రూ.600 కోట్లు అయితే.. అందులో రూ.2,000 కోట్లు, రూ.3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కనీస ఇంకితజ్ఞానం, సోయి లేకుండా బట్టకాల్చి మీద వేసేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు" అని లింగం యాదవ్ లెక్కలతో సహా నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story