తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపే.. కాంగ్రెస్ నేత లింగం యాదవ్ ఫైర్!

Lingam Yadav: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకుడు లింగం యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 24 Jun 2026 11:13 AM IST
తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపే.. కాంగ్రెస్ నేత లింగం యాదవ్ ఫైర్!
X

Lingam Yadav: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకుడు లింగం యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రోను.. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ కలిసి తొమ్మిదో స్థానానికి దిగజార్చాయని మండిపడ్డారు, hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు.

కేంద్ర ప్రభుత్వం ఏదో మెహర్బానీ చేసినట్లు బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదని లింగం యాదవ్ హితవు పలికారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేటివ్ ఫెడరల్ స్ఫూర్తితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అదే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద సార్లైనా ఢిల్లీకి వెళ్తారని, ఎవరినైనా కలుస్తారని ఆయన స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story