News Anaysis: తాతా మధును సస్పెండ్ చేయాలి.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి: కాంగ్రెస్ నేత కృష్ణ తేజ
News Anaysis: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేత కృష్ణ తేజ డిమాండ్ చేశారు.
News Anaysis: తాతా మధును సస్పెండ్ చేయాలి.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి: కాంగ్రెస్ నేత కృష్ణ తేజ
News Anaysis: శాసనసభలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేత కృష్ణ తేజ hmtv ప్రత్యేక చర్చలో డిమాండ్ చేశారు. దళితుడైన స్పీకర్‌ను కించపరిచేలా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అసెంబ్లీ గేట్ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణ తేజ స్పష్టం చేశారు. అయితే సభకు రాకుండా బయట విమర్శలు చేస్తూ, సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిబంధనల ప్రకారమే నల్ల టీషర్ట్‌లను అడ్డుకున్నామని, ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించామని తెలిపారు.




