News Analysis: కేసీఆర్ దుర్మార్గమైన చట్టాలు తెచ్చారు! - కాంగ్రెస్ నేత జితేందర్
News Analysis: తెలంగాణలో ప్రస్తుతం కలకలం రేపుతున్న 22A (నిషేధిత భూములు) ఆన్లైన్ జాబితా వివాదానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
News Analysis: కేసీఆర్ దుర్మార్గమైన చట్టాలు తెచ్చారు! - కాంగ్రెస్ నేత జితేందర్
News Analysis: తెలంగాణలో ప్రస్తుతం కలకలం రేపుతున్న 22A (నిషేధిత భూములు) ఆన్లైన్ జాబితా వివాదానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 1971 నాటి రికార్డ్ ఆఫ్ రైట్స్ (RoR) చట్టాన్ని రద్దు చేసి, 2020లో కేసీఆర్ తెచ్చిన దుర్మార్గపు ధరణి చట్టం వల్లే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూ వివాదాలు తలెత్తాయని కాంగ్రెస్ ప్రతినిధి జితేందర్ ఆరోపించారు.
హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) డిబేట్‌లో పాల్గొన్న ఆయన, 22A నిషేధిత జాబితా సవరణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున స్పష్టమైన వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే భూముల ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాస్తు, అనుభవదారుల కాలమ్‌లను రద్దు చేసి చిన్నకారు రైతుల చట్టబద్ధమైన హక్కులను కాలరాసిందని విమర్శించారు.




