News Analysis: కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్.. బీఆర్‌ఎస్ నేత బాలారాజు ఫైర్!
News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసంతృప్తులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని hmtv డిబేట్‌లో బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలారాజు మండిపడ్డారు.
News Analysis: కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్.. బీఆర్‌ఎస్ నేత బాలారాజు ఫైర్!
News Analysis: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే కేసీఆర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తేవడంపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలారాజు hmtv డిబేట్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ప్రభుత్వంలోని అంతర్గత అసంతృప్తులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తులు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా అంశాన్ని లేవనెత్తుతున్నారని బాలారాజు విమర్శించారు.
Next Story




