News Analysis: కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఒక దగా.. బీఆర్ఎస్ సమరభేరి: సుమిత్ర ఆనంద్
News Analysis: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
News Analysis: కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఒక దగా.. బీఆర్ఎస్ సమరభేరి: సుమిత్ర ఆనంద్
News Analysis: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదికను "విద్యార్థి తనకు తానే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చుకున్నట్లుగా" ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని, ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బడికే వెళ్లని విద్యార్థి తనకు తానే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రగతి నివేదిక ఉందని సుమిత్ర ఆనంద్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వ పాలనకు అసలైన మార్కులు ఇస్తారని స్పష్టం చేశారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం ఈ నివేదికను తెచ్చారని ఆరోపించారు.




