Jordar News: సామాన్యుడికి కోపం వస్తే.. ఇలానే ఉంటుంది
Jordar News: కర్ణాటకలో గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత. గర్భవతిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తి రోడ్డుపై ధర్నా.
Jordar News: సామాన్యుడికి కోపం వస్తే.. ఇలానే ఉంటుంది
Jordar News: ట్రాఫిక్ ముచ్చటని జెప్పి రోడ్డు మీద కూసుండి ధర్నా జేస్తున్న అన్నను సూయిస్తున్నరేందని అనుకుంటున్నరా. ట్రాఫిక్ జెయ్యంగ ఈ అన్ననే ఇబ్బందివడ్డడు. దాంతోని కోపానికచ్చి ఇట్ల రోడ్డు మీద ధర్నాకు దిగిండన్నట్టు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సారు పొయ్యే కాన్వాయ్ కోసం అద్ద గంట దాంక అటుదిక్కు నుంచి పొయ్యే జనాలందర్ని ఆపేసిర్రట పోలీసులు. ఇగట్ల ట్రాఫిక్ ఆపేటాళ్లకు గర్భవతిగ ఉన్న భార్యను ఎమర్జెన్సీగ దవాఖానకు తీస్కపోదామని అనుకుంటే నడ్మిట్లనే ట్రాఫిక్ల చిక్కుకపోవుడయ్యిందట. దీంతోని ఆ అన్నకు మస్తు కోపమచ్చి గవర్నర్ కాన్వాయ్ కి అడ్డువడ్తామని రోడ్డు మీద కూసున్నడిట్ల. కాకుంటే., అటుదిక్కున్న ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పి పక్కకు తీస్కపోయిర్రు. ఈ పరిస్థితి ఒక్క కర్నాటకల అనేగాదు., అంతట గుడ గిట్లనే ఉన్నది. పెద్దపెద్దోళ్లు రోడ్డెక్కుతే., సామాన్య ప్రజలకు పెద్ద టాస్కే అన్నట్టే ఉంటది పరిస్థితి. గందుకే సీఎం రేవంతన్న.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను గంటల కమానం ఆపద్దు. తొవ్వ మీది నుంచి పొయ్యే జనాలకు ఇబ్బందులు వెట్టద్దని జెప్పిండు. కనీ., ట్రాఫిక్ పోలీసులు సక్కగ పన్జెయ్యకపొయ్యేటాళ్లకు ఆ గోసలు మాత్రం తప్పుతలెవ్వు పోండ్రి.




