News Analysis: ఒక్కరోజు సెలవు లేకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు: కాంగ్రెస్ నేత ఇంద్ర శోభన్
News Analysis: సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం 24 గంటలు పని చేస్తున్నారని..
News Analysis: ఒక్కరోజు సెలవు లేకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు: కాంగ్రెస్ నేత ఇంద్ర శోభన్
News Analysis: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 32 నెలల పాలనా కాలంలో కనీసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, అహర్నిశలు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్ర శోభన్ పేర్కొన్నారు. hmtv నిర్వహించిన డిబేట్‌లో ఆమె బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి రోజులో కొన్ని గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా, ప్రజాక్షేత్రంలో ఉంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు నడిపిస్తున్నారని ఇంద్ర శోభన్ స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతగా ఎన్నికై ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలపై గళం విప్పకుండా కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జీతాలు, అలవెన్సులు తీసుకుంటూ సభకు హాజరు కాని పక్షంలో బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేముందని సమర్థించుకున్నారు.




