Jordar News: ఈసారి వచ్చేది మేమే అది గుర్తుపెట్టుకో

Jordar News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బహిరంగ సభలో 'జై కాంగ్రెస్' అని నినాదాలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Jun 2026 7:19 AM IST
Jordar News
X

Jordar News: ఈసారి వచ్చేది మేమే అది గుర్తుపెట్టుకో

Jordar News: కడియం శ్రీహరి సారు జై కాంగ్రెస్ అని నినాదాలు జేసుడేగాదు., అక్కడున్నోల్లు సుతం అందరు అనాల్నని ఒక్కతీరుగ కోరిండు. కారు పార్టీ లీడర్లు పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి మీద శెర్యలు తీస్కోవాల్నని స్పీకర్ సారుకు ఫిర్యాదు వెట్టుకుంటే., కడియం సారు మాత్రం నేను పార్టీ మారలేదు, నేను కారు గుర్తు మీద గెల్శిన. కారు పార్టీల్నే ఉన్ననని జెప్పిండు. దాంతోని స్పీకర్ సారు అనర్హత వేటు ఎయ్యకుంట ఇడ్శిపెట్టిండు.

ఆ తర్వాత ఎవ్వలడినా.. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోని గెల్శినగనీ., అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతోని కల్శి పన్జేస్తున్ననని జెప్పుకచ్చిండు. ఇగిప్పుడు మళ్లేం ఫిర్యాదులు లెవ్వు గావట్టి., బహిరంగంగనే జై కాంగ్రెస్ అని నినాదాలు జేస్తున్నడు. ఇగియ్యాల జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంల కొత్తగ కట్టవోయే సబ్‌స్టేషన్లకు శంకు బండేశే కార్యక్రమంతోనట్టుగ కొత్తగ కట్టిన సబ్‌స్టేషన్లకు చిన్న సీఎం భట్టిసారు, ఎంపీ, ఎమ్మెల్యేలు గల్శి ప్రారంభోత్సవాలు చేశిర్రు. అటెంక వెట్టిన సభల ఇట్ల మాట్లాడుకచ్చిండు కడియం శ్రీహరి సారు. పేరుకే కారు పార్టీల గెల్శిండుగనీ., మనసంత కాంగ్రెస్ పార్టీలనే ఉండే.

గందుకే డైరెక్టు జై కాంగ్రెస్ అంటె ఒక్కశిత్తం అనుకోని ఇయ్యాల ఇట్ల జై కాంగ్రెస్ అని నినాదాలు జేశినట్టున్నడు. మరిగ దీని మీద కారుపార్టీ లీడర్లు ఏం మాట్లాడుతరో తెల్వదిగనీ., సోషల్ మీడియాల మాత్రం బగ్గనే కామెంట్లు జేస్తున్నరు కొందరు. నీతికి, నిజాయితీకి మారు పేరు అని జెప్పుకునే కడియం శ్రీహరి గెల్శింది ఓ పార్టీ అయితే.. జై కొట్టుకుంట నినాదాలు జేస్తున్నది ఇంకో పార్టీకి. గిదేనా నిజాయితీ, గిదేనా నీతి అని గట్టిగనే అర్సుకుంటున్నరు. మరిగ అటెంక దీని మీద కడియం సారు ఏం మాట్లాడుతడో.. ఎట్ల సమర్ధించుకుంటడో సూడాలె ఇగ.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story