News Analysis: హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు: BRS విజయ్ కుమార్!

News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద వ్యాపారులను, ప్రతిపక్షాలను బెదిరిస్తోందని బిఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 29 July 2026 11:51 AM IST
News Analysis
X

News Analysis: హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు: BRS విజయ్ కుమార్!

News Analysis: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'హైడ్రా' వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారిందని, దీన్ని అడ్డుపెట్టుకుని పెద్ద వ్యాపారవేత్తలను బెదిరిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. హెచ్‌ఎమ్‌టీవీ 'న్యూస్ అనాలిసిస్' చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా అధికారుల వైఖరిపై విమర్శలు గుప్పించారు.

హైడ్రా అనేది కేవలం ఒక జిఓ (G.O. 99) ద్వారా వచ్చిన సంస్థ మాత్రమేనని, దానికి ఎలాంటి చట్టబద్ధత లేదని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2012లో జిఓ 168 ద్వారా, అలాగే 2019లో బిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్ (సెక్షన్ 171) ద్వారా అక్రమ నిర్మాణాలను, చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు స్పష్టమైన చట్టాలు, అధికారాలను రూపొందించిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయకుండా, హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పేదల ఇళ్లను అర్ధరాత్రి పూట నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేనా కాంగ్రెస్ సాధించిన సంస్కరణ అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story