ఎస్‌బీఐని బెదిరించడం ఎంతవరకు సమంజసం? సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ ధ్వజం!
Sumithra Anand: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై, ముఖ్యంగా ఎస్‌బీఐ (SBI) భూముల వివాదం మరియు లావాదేవీల నిలిపివేత హెచ్చరికలపై బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎస్‌బీఐని బెదిరించడం ఎంతవరకు సమంజసం? సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ ధ్వజం!
Sumithra Anand: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై, ముఖ్యంగా ఎస్‌బీఐ (SBI) భూముల వివాదం మరియు లావాదేవీల నిలిపివేత హెచ్చరికలపై బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలో, నిందలు వేయడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముందుంటుందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే అబద్ధాలను కొనసాగిస్తోందని ఆమె విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎస్‌బీఐ భూములకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, అయితే సంస్థలు లేదా బ్యాంకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించామే తప్ప.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలాగా రచ్చ చేయలేదని సుమిత్రానంద్ స్పష్టం చేశారు.
ఒక ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ సంస్థతో తగాదాలు పెట్టుకుంటూ, ఎస్‌బీఐలోని ప్రభుత్వ లావాదేవీలన్నింటినీ నిలిపివేస్తామంటూ బెదిరింపు ధోరణికి పాల్పడటం వల్ల తెలంగాణ ప్రభుత్వ పరువు బజార్న పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.




