News Analysis: ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగే బీజేపీ.. నిఖిల్ రావు సంచలన వ్యాఖ్యలు!
News Analysis: ఇంత కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు ఎందుకు రాలేదని బిఆర్ఎస్ నేత నిఖిల్ రావు ప్రశ్నించారు.
News Analysis: ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగే బీజేపీ.. నిఖిల్ రావు సంచలన వ్యాఖ్యలు!
News Analysis: దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి దారితీసిన పేపర్ లీకేజీల నిరోధక బిల్లుపై పార్లమెంట్లో ఇంత సుదీర్ఘమైన, కీలకమైన చర్చ జరుగుతుంటే సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు ఎందుకు హాజరు కాలేదని బిఆర్ఎస్ నాయకుడు నిఖిల్ రావు ప్రశ్నించారు. హెచ్‌ఎమ్‌టీవీ 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బీజేపీ వైఖరిపై మరియు విద్యార్థుల ఆందోళనలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నిఖిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సంబంధించిన రాజకీయ విభాగామే భారతీయ జనతా పార్టీ అని, బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నది జగద్విదితమని పేర్కొన్నారు. దేశంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన యాంటీ పేపర్ లీక్ బిల్లు సభలో చర్చకు వచ్చిన సమయంలో దేశ అగ్రనేతలు పార్లమెంట్‌కు రాకుండా గైర్హాజరు కావడం ఏంటని నిలదీశారు.




