ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌ది.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నేత దిలీప్ రెడ్డి ఫైర్!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై బీఆర్‌ఎస్ నేత దిలీప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 12:13 PM IST
ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌ది.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నేత దిలీప్ రెడ్డి ఫైర్!
X

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం, ఐకేపీ సెంటర్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్‌ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. hmtv డిబేట్ పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.

ఎన్నికల ప్రచారంలోనూ, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ‘ఎంతైనా వరి పండించుకోండి.. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత మాది’ అని రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీలు ఇచ్చారని దిలీప్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ పరిమితం చేస్తూ నిబంధనలు పెట్టడం రైతులను వంచించడమేనని మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story