News Analysis: దమ్ముంటే ఏ వేదికపైకైనా చర్చకు రావాలి: బీఆర్‌ఎస్ నేత దత్తాత్రేయ

News Analysis: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో బీఆర్‌ఎస్ నేత దత్తాత్రేయ సవాల్.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 12:50 PM IST
News Analysis
X

News Analysis: దమ్ముంటే ఏ వేదికపైకైనా చర్చకు రావాలి: బీఆర్‌ఎస్ నేత దత్తాత్రేయ

News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'హెచ్‌ఎంటీవీ' నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు దత్తాత్రేయ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విద్వంసకరంగా మారిందని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దత్తాత్రేయ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.15,000, మహిళలకు రూ.2,500 బృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఏ వేదికపైకైనా వచ్చి తమ పదేళ్ల అభివృద్ధి పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story