News Analysis: క్షుద్ర పూజలు నిజమైతే మా ప్రభుత్వమే పోయేది కాదు: బీఆర్ఎస్ నేత మల్సయ్య యాదవ్!

News Analysis: హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లాం మల్సయ్య యాదవ్ తీవ్రంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 12:41 PM IST
News Analysis: క్షుద్ర పూజలు నిజమైతే మా ప్రభుత్వమే పోయేది కాదు: బీఆర్ఎస్ నేత మల్సయ్య యాదవ్!
X

News Analysis: హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. హరీశ్‌రావుపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజల వ్యాఖ్యలు చేయడం కేవలం దిగజారుడు రాజకీయమేనని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లాం మల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. హెచ్‌ఎమ్‌టీవీ ‘న్యూస్ అనాలసిస్’ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు.

"ఒకవేళ పూజలు, క్షుద్ర పూజల వల్ల అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఊడిపోయేది కాదు కదా? ప్రభుత్వం కాపాడుకోవడానికైనా అప్పుడే పూజలు చేసుకునేవాళ్లం కదా" అని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు గారు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న నాయకుడని, ఒకరి కీడు కోరుతూ పూజలు చేసే సంస్కారం ఆయనకు గానీ, బీఆర్ఎస్ పార్టీకి గానీ లేదని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story