Big Debate: హైడ్రాకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదు.. పేదలను బలిచేస్తే చూస్తూ ఊరుకోం: బచ్చు శ్రీనివాస్!

Big Debate: హైడ్రా వ్యవస్థకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, కేవలం పేదల ఇళ్లను కూలుస్తూ పెద్దల జోలికి వెళ్లకపోవడాన్నే ప్రశ్నిస్తున్నామని హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో బీఆర్‌ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 28 July 2026 12:13 PM IST
Big Debate
X

Big Debate: హైడ్రాకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదు.. పేదలను బలిచేస్తే చూస్తూ ఊరుకోం: బచ్చు శ్రీనివాస్!

Big Debate: చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణల నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'హైడ్రా' (HYDRA) వ్యవస్థకు బీఆర్‌ఎస్ పార్టీ ఏనాడూ వ్యతిరేకం కాదని, చట్టబద్ధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడే చర్యలను తాము స్వాగతిస్తామని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, పెద్దల ఆక్రమణలను వదిలేసి కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా బుల్డోజర్లు నడపడాన్ని, ముందస్తు నోటీసులు లేకుండా విరుచుకుపడటాన్నే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం మరియు కంటెంట్ ఆఫ్ కోర్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' (BIG Debate) కార్యక్రమంలో పాల్గొన్న బచ్చు శ్రీనివాస్ తమ పార్టీ వైఖరిని స్పష్టంగా వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story