ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే వైఫల్యం: బీజేపీ నేత తులా ఆంజనేయులు ధ్వజం

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల అవస్థలపై బీజేపీ రాష్ట్ర నాయకుడు తులా ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 11:37 AM IST
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే వైఫల్యం: బీజేపీ నేత తులా ఆంజనేయులు ధ్వజం
X

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే వైఫల్యం: బీజేపీ నేత తులా ఆంజనేయులు ధ్వజం

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల అవస్థలపై బీజేపీ రాష్ట్ర నాయకుడు తులా ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. hmtv న్యూస్ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఐకేపీ సెంటర్లలో రైతులు పడుతున్న ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లోపమే కారణమని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ‘ప్రతి గింజనూ కొంటాం, రైతులకు నష్టం రానివ్వం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి భారీ హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అభద్రతా భావానికి లోనవుతున్నారని ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇతర ప్రత్యామ్నాయ పంటలపై సరైన అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story