News Analysis: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి
News Analysis: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో మండిపడిన బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి.
News Analysis: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి
News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'హెచ్‌ఎంటీవీ' నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో వైఫల్యాలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆరు గ్యారెంటీలు మరియు ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని శ్రీవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మరే హామీ సక్రమంగా అమలు కాలేదని, రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీశారు.
Next Story




