ఎస్‌బీఐ లావాదేవీల నిలిపివేత చిన్న పిల్లల ఆటనా?.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత అమర్నాథ్ ఫైర్!
Telangana Govt vs SBI: Telangana Govt vs SBI: రాయదుర్గం భూ వివాదం నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో అన్ని ప్రభుత్వ లావాదేవీలను నిలిపివేయాలని..
ఎస్‌బీఐ లావాదేవీల నిలిపివేత చిన్న పిల్లల ఆటనా?.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత అమర్నాథ్ ఫైర్!
Telangana Govt vs SBI: రాయదుర్గం భూ వివాదం నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో అన్ని ప్రభుత్వ లావాదేవీలను నిలిపివేయాలని, నిధులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రతిష్టను, సీఎం స్థాయిని దిగజార్చేలా ఉందని విమర్శించారు.
ఎస్‌బీఐ సంస్థకు గతంలో కేటాయించిన భూమి రికవరీ ప్రొసీజర్‌ను పూర్తిగా పూర్తి చేయకుండానే, ప్రభుత్వం ఆ ల్యాండ్‌ను మరొక ప్రైవేట్ కంపెనీకి వేలం వేసి అప్పగించడం పెద్ద చీటింగ్ అని అమర్నాథ్ ఆరోపించారు.
ఎస్‌బీఐ చైర్మన్ మౌఖికంగా (ఓరల్‌గా) ఒప్పుకున్నారని కాంగ్రెస్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ వ్యవహారాలు అనేవి అగ్రీమెంట్లు, చట్టాల ప్రకారం నడుస్తాయి తప్ప, నోటి మాటలతో సాగే చిన్న పిల్లల ఆట కాదని హితవు పలికారు. ప్రభుత్వం రూల్స్ పాటించనందుకే ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించిందని, ఇందులో ఎలాంటి రాజకీయ శక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు.




