News Analysis: ప్రభుత్వ వైఫల్యానికి ఐపీఎస్ రంగనాథ్ బలిపశువు: బిజెపి నేత లక్ష్మీనారాయణ!

News Analysis: హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ, ప్రభుత్వం చేసిన తప్పులకు ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను బలిపశువు చేశారని బిజెపి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఆరోపించిన కథనం.

Arun Chilukuri
Published on: 28 July 2026 12:40 PM IST
News Analysis
X

News Analysis: ప్రభుత్వ వైఫల్యానికి ఐపీఎస్ రంగనాథ్ బలిపశువు: బిజెపి నేత లక్ష్మీనారాయణ!

News Analysis: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంపై బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వ నిర్వాహకానికి ఒక ఐపీఎస్ అధికారిని బలిపశువు చేశారని, 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడటం ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యమైన అంశాలపై స్పందించారు.

హైడ్రా కమిషనర్ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని, ప్రభుత్వం వెనుక ఉండి నడిపించడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేశారు. కోర్టుల నుంచి 63 సార్లు హెచ్చరికలు, ధిక్కరణ నోటీసులు వచ్చినా ప్రభుత్వం సమీక్షించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. చివరికి అధికారి రంగనాథ్‌ను ఈ వ్యవహారంలో బలి చేశారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story