అమెరికా - ఇరాన్ యుద్ధం ఎటువైపు? ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ ప్రభావంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్

అమెరికా - ఇరాన్ యుద్ధం ఎటువైపు వెళ్తోంది? ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు, అంతర్జాతీయ ఆర్థిక ప్రభావంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్ ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 11:58 AM IST
అమెరికా - ఇరాన్ యుద్ధం ఎటువైపు? ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ ప్రభావంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్
X

అమెరికా - ఇరాన్ యుద్ధం ఎటువైపు? ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ ప్రభావంపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరు, దానికి సంబంధించిన తాజా పరిణామాలపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన బిగ్ డిబేట్ చర్చా వేదికలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితులకు సర్దుకుపోతున్న తీరును విశ్లేషకులు ప్రస్తావించారు.

అమెరికా సైనిక బలగాలు ఇరాన్‌కు చెందిన ఆయిల్, యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తూ అమెరికా నావల్, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేస్తూ ప్రతిదాడులకు పాల్పడుతోంది.

స్ట్రైట్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రాంతంలో ఇరాన్ మరియు అమెరికా నౌకల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు కఠినతరం చేసినప్పటికీ, చమురు ధరలు పెరిగినప్పటికీ, మార్కెట్లో సరఫరా కొరత పెద్దగా లేకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ అనిశ్చితికి కొంతమేర అలవాటు పడినట్లు నిపుణులు విశ్లేషించారు.

టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన డిఫెన్స్ డిక్లరేషన్ (మక్కా డిక్లరేషన్) మరియు మిడిల్ ఈస్ట్ పరిణామాలు ఈ యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై చర్చ జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.