Jordar News: బాహుబలి హెల్మెట్ ఎప్పుడైనా చూసారా?
Jordar News: సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తాలో వాహనదారుల కోసం వినూత్నంగా 'బాహుబలి హెల్మెట్' ప్రచారాన్ని ఏర్పాటు చేశారు.
Jordar News: బాహుబలి హెల్మెట్ ఎప్పుడైనా చూసారా?
Jordar News: అగో ఇదేందయ్యా ఇది.. నేనెన్నడు సూడలేదు అని పర్శాన్ గాకుర్రుల్ల గిది సూశి. బాహుబలి హెల్మెట్ అంటరుల్ల దీన్ని. అంటె బాహుబలి సీన్మాల ప్రభాస్ పెటుకున్న హెల్మెట్ కాదుల్లో.. హెల్మెట్ పెట్టుకోకుంట బండ్లు నడ్పిటొల్ల కండ్లు తెర్పిచ్చే హెల్మెట్ అన్నట్టు. హెల్మెట్ పెట్టుకునుడు ఎంత అవుస్రమో నల్గురికి తెల్శేతట్టు సికింద్రాబాదు మెడికవర్ దావకాణొల్లు సికింద్రాబాదు సంగీత్ చౌరస్తా కాడ కొలువు జేశిర్రు దీన్ని. దావకాణొల్లు, పోలీసొల్లతోటి కల్శి కమిషనర్ సుమతి మేడం చాల్జేశింది ఇయ్యల్ల. అచ్చం ఇద్వరకట్ల ఇసోంటి బాహుబలి హెల్మెట్ను తార్నాక జంక్షన్‌ల గుడ పెట్టిర్రు మొన్నట్ల సర్వేజన ఫౌండేషనొల్లు. అయితే అది మాములు బొమ్మే గని, ఇదట్ల గాదుల్లో.. ఎర్రటి రంగుల, యుద్ధంల సైనికులు పెట్టుకునే హెల్మెట్ లెక్కుండి, ఇగో ఇట్ల గుండూర్కంగ తిర్గుతది. ఇగ దీనికి పర్ద గుంజినంక సెల్ఫీ పోట్వలు గుడ దిగిర్రు అందరాకం. కమిషనర్ మేడంకు శాల్వ గప్పి సన్మానం గుడ శేశిర్రు. అటెంక కమిషనర్ సుమతి మేడం ఇగో ఇట్ల మాట్లాడుకచ్చింది.
ఇన్నరు గదా కమిషనర్ మేడం శెప్పింది. హెట్మెల్ పెట్టుకునుడు ఎంత ముఖ్యమో..మంచి కంపినీ హెల్మెట్ పెట్టుకునుడు, దాన్ని మంచిగ ఫిక్సు జేశి పెట్టుకునుడు శానా ముఖ్యమటనుల్ల. ఎందుకంటె హెల్మెట్ సక్కగ పెట్టుకోక గుడ శాన మంది పానాలు పోగొట్టుకున్నరట. అందుకే పబ్లిక్కు.. హెల్మెట్ లేకుంట అసల్కే బండి నడ్పకుర్రి.. మీ ఇంటొల్లకు దూరం కాకుర్రి. ఇగో ఈ బహుబలి హెల్మెట్ సూశన్న కొంచెం మారుర్రి..ఇంటున్నరా..ఆ.




