News Analysis: డీఎస్సీలో తీవ్ర అన్యాయం.. వీడియో ఆధారాలతో విరుచుకుపడ్డ వైసీపీ!

News Analysis: ఏపీ డీఎస్సీ ఎంపికల వివాదంపై హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2026 12:07 PM IST
News Analysis
X

News Analysis: డీఎస్సీలో తీవ్ర అన్యాయం.. వీడియో ఆధారాలతో విరుచుకుపడ్డ వైసీపీ!

News Analysis: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన 'న్యూస్ అనాలిసిస్' డిబేట్‌లో వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ పాల్గొని, అధికార టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అర్హులైన నిరుద్యోగులను పక్కనబెట్టి, అనర్హులకు పట్టం కట్టిందని ఆరోపించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆరోపణలు, ఉద్యమాలకు తావులేకుండా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దాదాపు 1,30,000 ఉద్యోగాలు, మొత్తం కలిపి 2,60,000 పైచిలుకు ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని రాజశేఖర్ గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో స్వపక్ష నేతల సిఫార్సులను కూడా పక్కనబెట్టి కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story