Jordar Varthalu: మనసు దోచుకుంటున్న ఆదిలాబాద్ కలెక్టర్
Jordar Varthalu: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు అదిరిపోయే సంగీత మాస్టర్ అవతారం ఎత్తారు!
Jordar Varthalu: మనసు దోచుకుంటున్న ఆదిలాబాద్ కలెక్టర్
Jordar Varthalu: వారెవ్వా.. సారు, తబలా స్పెషలిస్టు జాకీర్ హుస్సేన్ను మర్పిత్తున్నడు గద. శ్రుతి, లయలు తప్పకుంట.. ఫుల్ టైం ప్రొఫెషనల్ వాయిద్యకారుని లెక్కనే తబలా వాయిస్తున్నడు. ఆగుర్రి గిదొక్కటేనా.. సారు లోపట ఇంకో ట్యాలెంటు సుతం ఉంది అది గూడ సూడుర్రి. సారూ.. కానియ్యుర్రిగ.
వాయిస్.. వాయిద్యం ఏదైనా.. ఎన్కకు తగ్గేదేలేదంటున్నడు గద. ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ కాడ సర్కార్ పెద్దబల్లె వెట్టిన సమ్మర్ క్యాంపును ఛాల్జేశేతందుకు వోయిండు జిల్లా కలెక్టర్ రాజర్షిషా సారు. ఇగాడ రిబ్బన్ గుంజినంక, శిన్నప్పుడు నేర్సుకున్న తబలా, హార్మోనియం కానొచ్చెటాలకు పాపం.. సారు పానం గుంజినట్టైంది. మనకు తెల్శిన విద్యను పది మందికి పంచకపోతే ఎట్లా అని.. సారే స్వయంగ సంగీతం మాస్టారైండు. ముందుగాల వాయించి సూపెట్టిండు. అటెంక పిలగాండ్లకు కుద్దుగ నేర్పిచ్చిండు. శేత్లు తబలా మీద ఎట్ల పెట్టాలె. ఏడ అదిమి పట్టాలె, ఏ ఏలుతోని తబలా వాయించాల్నో, హార్మోనియం పెట్టెతోని సంగీత స్వరాలు ఎట్ల పల్కియ్యాల్నో శిన్నపిలగాండ్లకు అరటిపండు ఒల్శిపెట్టినంత అల్కగ జెప్పిండు. ఇగాడున్న ఇద్దరు శిన్నలు సారు శెప్పింది మంచిగ తల్కాయకు ఎక్కిచ్చుకున్నరు.
నేర్సుకున్నది సారుకు సూపెట్టిర్రు. ఇగ ఇప్పటి దాంక సారు లోపటున్న ఈ కలలను సూడని అధికార్లు ముందుగాల పర్శానైర్రు. అటెంక సారుకు సప్పట్లతోని సత్కారం జేశిర్రు. ఈ ఎండాకాలం సెల్వులను ఉత్తగ కరావ్ జేసుకోకుంట.. సర్కార్ వెట్టిన ఉచిత శిబిరాలను వినియోగించుకొని, కళాకారులు కావాల్నని జెప్తున్నడు రాజర్షి సారు. ఇంక ఇవ్వేగాదుల్లో.. శాన్నే నేర్పిత్తున్నరట సమ్మర్ క్యాంపుల. పిలగాండ్లూ.. సారు జెప్పినట్టు అన్ని కుద్దుగ నేర్సుకొని సారంత పేరెల్లెలా మరి. రాజర్షి సారు, ఏలువడిలనే కాదు.. కలలను సూపెట్టుట్ల సుతం ఆయ్నను మించినోల్లు లేరని అనుకుంటున్నరు అటు దిక్కు జనాలు.




