Trending Video: స్కూల్ అసెంబ్లీలో బుడ్డోడు చేసిన పనికి నవ్వాపుకోలేరు!

Trending Video: చిన్న పిల్లలు చేసే కొన్ని చేష్టలు మనకు భలే నవ్వు పుట్టిస్తాయి. అలా ఓ చిన్నోడు స్కూల్ అసెంబ్లీలో చేసిన పని చూస్తే మీకు నవ్వాపుకోవడం కష్టం అయిపోతుంది.

KVD Varma
Published on: 26 March 2026 6:25 PM IST
Trending Video: చిన్న పిల్లలు చేసే కొన్ని చేష్టలు మనకు భలే నవ్వు పుట్టిస్తాయి
X

Trending Video

Trending Video: బాల్యం ఎంతో మధురమైనది అని అనుకుంటారు పెద్దలు. కానీ, తాము బాల్యంలో ఏమి చేశామో వారికి చాలావరకూ గుర్తుండదు. తెలిసీ తెలియక చేసిన పనులు.. చిలిపి చేష్టలు.. ముద్దుల అల్లరి ఇవన్నీ పెద్దగా గుర్తుండవు. అందుకే ఎప్పుడైనా మన ముందు ఎవరైనా చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నా.. చిన్నగా అల్లరి చేస్తున్నా మురిసిపోతాం. అబ్బా వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు అని అనుకుంటాం. చిన్న పిల్లలు ముఖ్యంగా 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చిన్నారులు చేసే పనులు మనకు భలే ముచ్చటగా అనిపిస్తాయి. ఒక్కసారి ఎవరైనా పిల్లలు ఏదైనా చేస్తే దానిని తలుచుకుని, తలుచుకుని నవ్వుకుంటాం. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా.. చిన్నారులు చేసే ముద్దు పనులను వీడియోలుగా చాలామంది షేర్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వీడియోలు చూసి ఆ పిల్లల చేష్టలు చూసి కాసేపు మనల్ని మనం మర్చిపోయి హాయిగా నవ్వేసుకుంటాం. అది పెద్ద స్ట్రెస్ బస్టర్ కూడా. ఇదిగో అలాంటి స్ట్రెస్ బస్టర్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

స్కూల్లో ఉదయం అసెంబ్లీ మీకు గుర్తుందా. దైవ ప్రార్ధనలు.. ప్రతిజ్ఞ, జనగణమణ.. జైహింద్. మరీ చిన్నతనంలోవి గుర్తుండకపోయినా.. కాస్త పెద్దయ్యాకా స్కూల్ లో ఆ అసెంబ్లీ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా అసెంబ్లీ అనగానే చేసిన అల్లరి కూడా గుర్తుంటుంది. కొద్దిగా ఊహ తెలిసాకా చేసిన అల్లరి గుర్తు వస్తేనే భలే అనిపిస్తుంది. మరి చిన్నారి గడుగ్గాయిలు అసెంబ్లీ సమయంలో చేసిన చేష్టలు చూస్తే.. అడిగాడా స్ట్రెస్ బస్టర్ అంటే. ఇదిగో ఇక్కడ వీడియోలో ఒక చిన్నోడు స్కూల్ అసెంబ్లీలో కళ్ళు మూసుకుని లాలీ పాప్ తినేస్తున్నాడు. దానిని తింటున్నప్పుడు మనోడి ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు నవ్వాగదు. ప్రార్థన అయిపోయేలోపు దాని పని అవగొట్టి.. లాలీపాప్ కి ఉండే చిన్న పుల్లముక్కను జాగ్రత్తగా జేబులో పెట్టుకుని.. సరిగ్గా జైహింద్ చెప్పే టైముకి కళ్ళు తెరిచి జైహింద్ అన్నాడు. జస్ట్ నిమిషం కూడా లేని ఈ వీడియో చూస్తే నవ్వు రావడమే కాదు. ఆలాంటి బుడ్డోడిని పట్టుకుని ముద్దు పెట్టేయాలనిపిస్తుంది. ఇదంతా చెప్పడం ఎందుకు గానీ, మీరు చూసేయండి ముందు ఈ వీడియో..


ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా. నవ్వాపుకోలేకపోతున్నారు కదూ.. నవ్వేయండి. మనసారా నవ్వేసుకుని కాస్త రిలాక్స్ అయిపోండి. అందుకే గదా ఈ వీడియో మీకోసం తెచ్చింది.

Shubham_kr_rana అనే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో షేర్ అయినా ఈ వీడియో ఇప్పటికే 11 లక్షల మందికి పైగా చూశారు. విపరీతంగా షేర్లు కొట్టారు. కొంతమంది వీడియోలో బుడ్డోడికి కామెంట్స్ కూడా పెట్టారు. ఆ పిల్లోడి అమాయకత్వం హృదయానికి హత్తుకునేలా ఉందని ఒకాయన అంటే.. ఇంకో ఆయన అరే.. నువ్వు కళ్ళు మూసుకున్నా అందరూ నిన్ను చూస్తార్రా బాబూ అని సరదాగా కామెంటాడు. ఇక ఒక నెటిజన్ అయితే, ఆ వీడియో తీసినాయన్ని గట్టిగా వేసుకున్నాడు. ఆ చిన్నోడి ప్రయివసీ కి భంగం కలిగించారంటూ కోప్పడ్డారు.

అదండీ సంగతి.. అప్పుడప్పుడు ఇలాంటి అమాయకపు పిల్లల చేష్టలు చూసి సరదాగా నవ్వుకుంటే పోయేదేమీ లేదు కదా.. ఏమంటారు?

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story