Jordar Varthalu: 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సోమనాథ్ ఆలయం

Jordar Varthalu: గుజరాత్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు! ఈ సందర్భంగా జరిగిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 May 2026 7:01 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సోమనాథ్ ఆలయం

Jordar Varthalu: సోమానాథ్ గుడి పునర్నిర్మాణమయ్యి 75 ఏండ్లు నిండినయని ఉత్సవాలు జర్పిత్తె పీఎం మోడీ సారు స్వయంగ హాజరువడి స్పెషల్ పూజలు జేశిండుల్ల ఇయ్యల్ల. ఏర్పాట్లయితె జోరుగ జేశిర్రుల్ల గుడికాడ.భక్తులు గుడ శితం పట్టిర్రు. పీఎం సారు గుడి జాగల కాలువెట్టుడాల్శం.. ఢమరుకం సప్పుళ్లతోటి సాగతం పట్టిర్రు ఘనంగ. తొల్త పదకొండు పుణ్యక్షేత్రాల కాన్నుంచి తెచ్చిన పవిత్ర జలాలతోటి కుంభాభిషేకం జర్పిచ్చి, అటెంక వేద పండితులు మంత్రాలు సద్వుతుంటె సోమానాథేశ్వరునికి స్పెషల్ పూజలు జేశిండు పీఎం సారు.

పదకొండు పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రజలాలు తెచ్చి కుంభా‎భిషేకం జేసుడు ఇదే శిట్ట శిమాంటనట. ఇగ గుడినైతే ఏమన్న డెకరేషన్ జేశిర్రానుల్ల. మస్తు ముస్తాబు జేశిర్రు. మొగులు మీదికెల్లి హెలికాప్టర్ల తోటి పూల వర్షం కురిపిస్తుంటె సూడాలె సోమానాథుని వైభోగం.. సూశేందుకు రొండు కండ్లు సరిపోవంటే నమ్ముర్రి. అట్ల అలంకరించిర్రు గుడని. మరి సోమనాథేశ్వరుడు అంటె మామూలు ముచ్చటనా.. 12 జ్యోతిర్లింగాలల్ల ఒకటి. శానా పెద్ద శరిత్రే ఉన్నది ఈ గుడికి. అప్పుడెప్పుడో ఎన్కట అప్పటి ముస్లీం రాజులు సోమానాథ్ గుడిని కూలగొట్టిర్రు.

అటెంక శానా ఏండ్లకు అంటె పంతొమ్మిది వందల యాభై ఒక్కట్ల అప్పటి తొలిసూరు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారు చేతుల మీద గుడిని మల్ల బాగు శేశిర్రు. అది జరిగి ఇయ్యాల్టికి 75 ఏండ్లు గడ్శినయి. అందుకే ఇట్ల ఉత్సవాలు జర్పిచ్చిర్రన్నట్టు. ఇగ అ‌ఖర్కు ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతోటి ఎయిర్ షో గుడ జేశిర్రు గుడి కాడ మొగులు మీద. జెండా రంగుల పొగను బైటికి ఇడ్సుకుంట జెట్ విమానాలు మొగులు మీద తిర్గుతాంటె పీఎం సారు సుతం మస్తు సంబురం కొద్ది సూశిండు. మరిగ ఈ సందర్భంగ ఆ సోమనాథేశ్వరుని కరుణాకటాక్షాలు దేశంలున్న పబ్లిక్కందరి మీద ఉండాల్నని మా జోర్దార్ వార్తల తర్పున కోరుకుంటున్నం.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story