Thottambedu: పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ: తొట్టంబేడు పీహెచ్‌సీ

Thottambedu: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా తొట్టంబేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 Aug 2026 4:51 PM IST
Thottambedu
X

Thottambedu: పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ: తొట్టంబేడు పీహెచ్‌సీ

తొట్టంబేడు, ఆగస్టు 20: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టంబేడు నందు గురువారం ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధికి కారణమైన దోమలపై పరిశోధనలు చేసి ప్రపంచానికి కీలకమైన సమాచారాన్ని అందించిన సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మలేరియా నివారణ, దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్న అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి, సంపూర్ణ PHN, నాగేంద్ర MPHA (HS), ధనమ్మ MPHA (HS), వెంకటేశ్వర్లు ముదిరాజ్ MPHM (M), నీరజ స్టాఫ్ నర్స్, నరేష్ ఫార్మసిస్ట్, భాను ల్యాబ్ టెక్నీషియన్, సంధ్య ANM, వరలక్ష్మి ANM, భారతి ఆశా కార్యకర్తతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు నిఫీసా, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story